ఇదో రకం శిక్ష | Sakshi
Sakshi News home page

భార్యలతో హెల్మెట్‌ తొడిగించేశారు

Published Mon, Oct 9 2017 8:23 AM

On Karva Chauth married men Punished with Helmet

సాక్షి, లక్నో : నిబంధనలు మన మంచికేనన్నది తెలిసి కూడా వాటిని ఉల్లంఘించటం కొందరికి అలవాటుగా మారింది. గతేడాది దేశవ్యాప్తంగా నమోదయిన రోడ్డు ప్రమాదాల్లో 84 శాతం ఉత్తర ప్రదేశ్‌లోనే నమోదయి జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. వీటిలో 55 శాతం హెల్మెట్‌ ధరించకపోవటంతో జరిగినవే. 

ఈ నేపథ్యంలో ఆదివారం అక్కడి పోలీస్ శాఖ ఓ పని చేసింది. హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన వారికి ఫైన్‌ వేయకుండా వారి భార్యలను అక్కడికి పిలిపించింది. ఆపై మహిళల చేతుల మీదుగా వారి భర్తలకు హెల్మెట్‌లు తొడిగించింది. కర్వా చౌత్‌ పండగ సందర్భంగా పోలీసులు ఈ పని చేయించారు. ఇందుకోసం తమ సొంత నిధులనే ఖర్చు చేశారు పోలీసులు.

‘భర్తలు బాగుండాలని కోరుకుంటూ పెళ్లయిన ఆడవాళ్లంతా తప్పనిసరిగా చేసుకునే పెద్ద పండుగ ఇది. అందుకే వారి చేతుల మీదుగా ప్రాణాల విలువ తెలియజేసేలా ఈ పని చేయించాం. వాహనదారులకు మేం చేసే సూచన ఒక్కటే దయచేసి హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడపకండి’ అని ఎస్పీ దీపక్‌ కుమార్ తెలిపారు. 

Advertisement
Advertisement