breaking news
without a helmet
-
పిలియన్.. పారాహుషార్!
సాక్షి, హైదరాబాద్: ‘నగరంలో వాహనాల సరాసరి వేగం గంటకు పట్టుమని పాతిక కిలో మీటర్లు కూడా లేదు. మరి హెల్మెట్లు ఎందుకు?’ ఇది అనేక మంది చేసే వ్యాఖ్య. ‘వాహనం నడిపే వ్యక్తి పెట్టుకుంటే చాలు. వెనక కూర్చునే వారికి హెల్మెట్ ఎందుకు?’ ఇది పలువురి నుంచి వచ్చే ప్రశ్న. ఇప్పటికీ నగరంలో అనేక మంది హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతుండగా... వాహనం వెనుక కూర్చునే వ్యక్తి (పిలియన్ రైడర్) హెల్మెట్ ధారణ అనేది అరుదైన దృశ్యమే. ఇదే సిటీలో ఏటా పదుల సంఖ్యలో మరణాలకు కారణమవుతోందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది. 2019–2025 ఏప్రిల్ మధ్య ప్రమాదాలకు సంబంధించిన గణాంకాలను అధ్యయనం చేస్తే ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మధ్య కాలంలో మొత్తం 17,506 ప్రమాదాలు జరగ్గా.. వీటిలో ద్విచక్ర వాహనాలకు సంబంధించినవి 8,582గా ఉన్నాయి. వీటిలో మొత్తం 1,081 మంది మృత్యువాతపడగా.. 691 మంది రైడర్లు, 236 మంది పిలియన్ రైడర్లు హెల్మెట్ ధరించని కారణంగా చనిపోయారు. అత్యధికులు కేసులకు భయపడే.. నగరంలో ఇప్పటికీ అనేక మంది వాహన చోదకులు ట్రాఫిక్ పోలీసులకు భయపడే హెల్మెట్లు ధరిస్తున్నారు. చౌరస్తాలు, చెకింగ్ పాయింట్లు ఉన్నప్పుడు మాత్రమే హెల్మెట్ పెట్టుకుని, ఆ తర్వాత దాన్ని తీసి బండికి తగిలించే వాళ్లు కోకొల్లలు. పోలీసులు విధించే చలాన్ల నుంచి తప్పించుకోవాలని భావించే వారిలో కొందరు ఏమాత్రం రక్షణ ఇవ్వని హాఫ్ హెల్మెట్లు, కర్మాగారాల్లో వినియోగించేవి పెట్టుకుంటున్నారు. ద్విచక్ర వాహనాలకు సంబంధించిన రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మరణాలు తలకు దెబ్బతగలడం వల్లే సంభవిస్తుంటాయి. ఇలా చనిపోయిన వారికంటే ఎక్కువగా జీవచ్ఛవాలుగా మారిన వాళ్లూ ఉన్నారు. ఈ పరిణామాలకు కారణం వాహన చోదకులతో పాటు పిలియన్ రైడర్లు హెల్మెట్ ధారణను పట్టించుకోకపోవడమే అన్నది పోలీసుల మాట. తీవ్రతలో పెద్దగా తేడా ఉండదు.. మోటారు వాహనాల చట్టం ప్రకారం ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వాళ్లూ హెల్మెట్ ధరించాల్సిందే. కొన్నేళ్ల క్రితం చేసిన సవరణల ప్రకారం నాలుగేళ్లు వయసు దాటిన వారు ఎవరైనా ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుంటే హెల్మెట్ తప్పనిసరి. అయితే సామాజిక, రాజకీయ, ఆర్థిక కారణాల నేపథ్యంలో పోలీసు విభాగం కేవలం రైడర్‌కు మాత్రమే హెల్మెట్ మస్ట్ నిబంధన అమలు చేస్తోంది. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వారు చనిపోవడానికి, తీవ్రంగా గాయపడటానికి ఎదుటి వాహనం కంటే రోడ్డు దెబ్బే ఎక్కువగా కారణం అవుతోంది. ఈ గాయాలు కావడంలో రైడర్, పిలియన్ రైడర్ అనే తేడాలు లేవని, ప్రమాదం జరిగినప్పుడు వీరిద్దరికీ అయ్యే గాయాల్లో పెద్దగా తేడా ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే ఇప్పటికీ ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడుల్లోని కొన్ని నగరాల్లో పిలియన్ రైడర్ సైతం హెల్మెట్ ధరించాలన్న నిబంధన కచి్చతంగా అమలవుతోందని పేర్కొంటున్నారు.కొన్నేళ్ల క్రితం సైబరాబాద్‌లో అమలు... వాహనం నడిపే రైడర్‌తో పాటు వెనుక కూర్చునే పిలియన్ రైడర్ సైతం కచి్చతంగా హెల్మెట్ ధరించాలనే విధానాన్ని సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం అధికారులు కొన్నేళ్ల క్రితం అమలు చేసినా ప్రస్తుతం అటకెక్కింది. మరోపక్క ద్విచక్ర వాహన చోదకులు కచి్చతంగా ఫుల్‌సైజ్ హెల్మెట్లు ధరించాల్సి ఉంది. దీంతో హాఫ్ హెల్మెట్లు ధరించిన వారికి అడపాదడపా చలాన్లు విధిస్తున్నారు. ప్రతి ఒక్క ద్విచక్ర వాహన చోదకుడు, పిలియన్ రైడర్ కచి్చతంగా హెల్మెట్లు ధరించాలంటూ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు. ‘వాహనం ప్రమాదానికి గురైనప్పుడు చోదకుడిపై ఎంత ప్రభావం ఉంటుందో.. పిలియన్ రైడర్‌కూ అదే స్థాయిలో ఉంటుంది. ద్విచక్ర వాహనం వెనుక కూర్చునే వ్యక్తి కచ్చితంగా హెల్మెట్ ధరించాలని న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి వాహన చోదకుడు దీన్ని అమలు చేయాలి. కచి్చతంగా ఐఎస్ఐ ప్రమాణాలతో కూడిన హెల్మెట్లే ఖరీదు చేయాలి’ అని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
ఇదేం చిత్రం: హెల్మెట్ లేదని ట్రక్కు డ్రైవర్‌కు జరిమానా
భువనేశ్వర్: నిబంధనల పేరిట ట్రాఫిక్ పోలీసులు విచ్చలవిడిగా జరిమానాలు విధిస్తూ వాహనదారుల జేబుకు చిల్లు వేస్తున్నారు. ప్రశ్నిస్తే మీ రక్షణ.. మీ భద్రత కోసమే ఇలా చేస్తున్నామని బదులు ఇస్తున్నారు. అయితే ఒక్కోసారి వీరి చేష్టలు.. ప్రవర్తన.. పని ప్రజలకు చిర్రెత్తుత్తుంది. తాజాగా అలాంటి సంఘటనే ఒడిశా రాష్ట్రంలో జరిగింది. హెల్మెట్ ధరించలేదని ట్రక్కు డ్రైవర్‌కు రూ.వెయ్యి జరిమానా విధించడం తీవ్ర దుమారం రేపుతోంది. అక్కడి ట్రాఫిక్ పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకునేందుకు ట్రక్కు డ్రైవర్ ప్రమోద్ కుమార్ శ్వాన్ జిల్లా కేంద్రం గంజంలోని స్థానిక ప్రాంతీయ రవాణా కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ అధికారులు అతడి వివరాలు పరిశీలించగా ఒక జరిమానా పెండింగ్‌లో ఉందని గుర్తించారు. అదేమిటంటే ‘హెల్మెట్ లేకుండా వాహనం నడపడం’ అని ఉంది. దీన్ని చూసి ప్రమోద్ కుమార్ షాక్‌కు గురయ్యాడు. ట్రక్కు నడిపే డ్రైవర్ హెల్మెట్ ధరించడమేంటి అని సందేహం వ్యక్తం చేశాడు. ట్రక్కు వాహనం నంబర్‌పైనే హెల్మెట్ లేకుండా వాహనం నడిపాడని జరిమానా విధించడం గమనార్హం. అధికారులకు ఎంత చెప్పినా వినకపోవడంతో ఆ డ్రైవర్ ప్రమోద్ కుమార్ రూ.వెయ్యి జరిమానా కట్టేశాడు. అనంతరం అతడి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేశారు. ‘మూడేళ్లుగా ట్రక్కు నడుపుతున్నా. నీటి సరఫరా చేసేందుకు ట్రక్కు వినియోగిస్తున్నా. నా పర్మిట్ గడువు ముగియడంతో రెన్యూవల్ కోసం ఆర్టీఓ ఆఫీస్‌కు వెళ్లాను. అక్కడ హెల్మెట్ లేకుండా ట్రక్కు నడుపుతున్నానని జరిమానా విధించారు. డబ్బుల కోసం వేధింపులకు గురి చేస్తున్నారు. అవసరం లేకున్నా వేధిస్తున్నారు. ఇలాంటి తప్పులను ప్రభుత్వం నిరోధించాలి’ అని ట్రక్కు డ్రైవర్ ప్రమోద్ కుమార్ మీడియాతో చెప్పాడు. -
హెల్మెట్ లేకపోతే అరకిలోమీటర్ నడవాల్సిందే!
ఆగ్రా : హెల్మెట్ లేకుండా ప్రయాణించే ద్విచక్రవాహనదారులకు ఉత్తరప్రదేశ్ పోలీసులు వింత శిక్షలను విధిస్తున్నారు. ఎన్ని ఫైన్లు విధించినా ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో మార్పురాకపోవడంతో ఆగ్రా పోలీసులు వినూత్న కార్యాచరణను రూపోందించారు. హెల్మెట్ లేకుండా పట్టుబడ్డ వారిని, బైక్ తో సహా 500 మీటర్లు(అరకిలోమీటర్) నడవాలని సూచిస్తున్నారు. ఈ విధానంపై ఇప్పటికే పలు ప్రచార కార్యక్రమాలను చేపట్టిన పోలీసులు గత బుధవారం నుంచి అమల్లోకి తెచ్చారు. ఈ చర్యతో వారి ఆరోగ్యం బాగుండటమే కాకుండా బైకర్స్‌లో మార్పు వస్తుందని, ఇది శిక్ష కాదని ఆగ్రా సీనియర్ ఎస్పీ అమిత్ పథక్ తెలిపారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఇప్పటికే హెల్మెట్ ధరించినవారికే పెట్రోల్ పోయాలని ఆదేశించిన పోలీసులు.. రోడ్డుభద్రతా ప్రమాణాలపై పాఠశాల, కాలేజీల్లో అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఆగ్రాలోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఈ ప్రమాదాలను తగ్గించేందు పోలీసులు కృషి చేస్తున్నారు. -
జార్ఖండ్ సీఎం హెల్మెట్ లేకుండానే...
-
సీఎం అండ్ కో, రూల్స్ బ్రేక్!
రాంచీ : ఓవైపు రోడ్డు భద్రత విషయంలో ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహక కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. అధికారులు మాత్రం అవేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ కూడా ఇలాంటి పనే ఒకటి చేసిన విమర్శలు ఎదుర్కుంటున్నారు. హెల్మెట్ లేకుండా బండి నడిపి వార్తల్లోకి ఎక్కారు. మొన్న దీపావళి రోజు జార్ఖండ్ సీఎం రోడ్డుపై హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడిపారు. జంషెడ్ పూర్లోని తన నివాసంలో వేడుకలు జరుపుకున్న అనంతరం ఆయన ఇలా ఓ స్కూటీపై నగరం మొత్తం చక్కర్లు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే ఇలా నిబంధనలను ఉల్లంఘించడం పట్ల ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అదే సమయంలో ఆయన సెక్యూరిటీ గార్డులు లేకుండా.. అనుచరులతో రోడ్డెక్కగా, వారికి హెల్మెట్లు లేకపోవటం విశేషం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేమో ట్రాఫిక్ నియమాలని నీతులు చెబుతుంటే.. అదే పార్టీకి చెందిన సీఎం మాత్రం ఇలా వ్యవహరించటం సరికాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, ఇండియాలో ప్రతీ గంటకు 16 మంది చొప్పున రోడ్డు ప్రమాదానికి గురవుతుంటే.. ప్రతీ నాలుగు నిమిషాలకు ఒకరు ప్రాణాలు విడుస్తున్నారని జాతీయ నేర పరిశోధన సంస్థ నివేదికలు చెబుతున్నాయి. హెల్మెట్ లేకుండా బండి నడిపిన సీఎం -
ఇదో రకం శిక్ష
సాక్షి, లక్నో : నిబంధనలు మన మంచికేనన్నది తెలిసి కూడా వాటిని ఉల్లంఘించటం కొందరికి అలవాటుగా మారింది. గతేడాది దేశవ్యాప్తంగా నమోదయిన రోడ్డు ప్రమాదాల్లో 84 శాతం ఉత్తర ప్రదేశ్‌లోనే నమోదయి జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. వీటిలో 55 శాతం హెల్మెట్ ధరించకపోవటంతో జరిగినవే. ఈ నేపథ్యంలో ఆదివారం అక్కడి పోలీస్ శాఖ ఓ పని చేసింది. హెల్మెట్ లేకుండా పట్టుబడిన వారికి ఫైన్ వేయకుండా వారి భార్యలను అక్కడికి పిలిపించింది. ఆపై మహిళల చేతుల మీదుగా వారి భర్తలకు హెల్మెట్లు తొడిగించింది. కర్వా చౌత్ పండగ సందర్భంగా పోలీసులు ఈ పని చేయించారు. ఇందుకోసం తమ సొంత నిధులనే ఖర్చు చేశారు పోలీసులు. ‘భర్తలు బాగుండాలని కోరుకుంటూ పెళ్లయిన ఆడవాళ్లంతా తప్పనిసరిగా చేసుకునే పెద్ద పండుగ ఇది. అందుకే వారి చేతుల మీదుగా ప్రాణాల విలువ తెలియజేసేలా ఈ పని చేయించాం. వాహనదారులకు మేం చేసే సూచన ఒక్కటే దయచేసి హెల్మెట్ లేకుండా వాహనాలు నడపకండి’ అని ఎస్పీ దీపక్ కుమార్ తెలిపారు. -
నో హెల్మెట్..నో పెట్రోల్..
సాక్షి, విశాఖపట్నం : రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటును తగ్గించేందుకు త్వరలో నో హెల్మెట్– నో పెట్రోల్ విధానాన్ని అమలు చేయాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. హెల్మెట్ లేని వాహన చోదకులకు పెట్రోల్ పోయకుండా పెట్రోల్ బంకుల యజమానులను ఆదేశించాలన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో పోలీస్ కమిషనర్ యోగానంద్, ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, వుడా వీసీ బసంత్‌కుమార్‌తో కలిసి పరిస్థితిని సమీక్షించారు. గతేడాది జరిగిన ప్రమాదాల గురించి డీటీసీ ఎస్.వెంకటేశ్వరరావు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. 2016లో జరిగిన 2,609 రోడ్డు ప్రమాదాల్లో 551 మంది మరణించారని, 2,058 మంది గాయాలపాలయ్యారని తెలిపారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ ద్విచక్రవాహనచోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చూస్తే చాలావరకు మరణాల రేటును తగ్గించవచ్చన్నారు. హెల్మెట్ వాడకంపై ద్విచక్రవాహనచోదకుల్లో అవగాహన పెరిగేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పోలీస్, రవాణా శాఖలు ప్రత్యేక చొరవతో ద్విచక్రవాహనచోదకులకు హెల్మెట్ తప్పనిసరి చేయాలన్నారు. సమన్వయంతో సత్ఫలితాలు అనకాపల్లి–ఆనందపురం జాతీయ రహదారి పనులు నిర్వహించే ముందు సమన్వయ కమిటీతో చర్చించి వారి సూచనలకు అనుగుణంగా పనులు నిర్వహిస్తే మంచి ఫలితాలుంటాయని సీపీ యోగానంద్ అన్నారు. నక్కపల్లి–యలమంచిలి రోడ్డుపై లైటింగ్, సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ సూచించారు. సమావేశంలో అదనపు డీసీపీ మహేంద్ర పాత్రుడు, ఏసీపీ కె.ప్రభాకరరావు, ఆర్టీవోలు ఎ.హెచ్. ఖాన్, ఐ.శివప్రసాద్, కేజీహెచ్ అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాద నివారణ మార్గాలివీ.. ► ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలను కలెక్టర్ అధికారులకు సూచించారు. ► ‘నో హెల్మెట్.. నో పెట్రోల్’ విధానం అమలుకు కార్యాచరణ రూపొందించాలి. ► జాతీయ రహదారికి అనుసంధానమయ్యే కూడళ్లలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున ఆ జంక్షన్లలో సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. ► కప్పరాడ, మధురవాడ, ఆనందపురం తదితర ప్రాంతాల్లో డివైడర్లు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నందున వాటిని ఏర్పాటు చేయాలి. ► రద్దీగా ఉండే గాజువాక, ఎన్ఏడీ, మద్దిలపాలెం, సత్యం తదితర జంక్షన్లలోనూ సెంట్రల్ మీడియన్ గ్రిల్స్ పాడైపోవడం, కొన్ని చోట్ల లేనందువల్ల ప్రమాదాలు జరుగుతున్నందున వాటిని నిర్మించాలి. ► జాతీయ రహదారి శివారు ప్రాంతాల్లో వీధి దీపాలు లేకపోవడం ప్రమాదాలకు దారి తీస్తున్నందున చర్యలు చేపట్టాలి. ► ప్రధాన రహదారుల్లో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపకుండా పార్కింగ్ స్థలాలను నిర్దేశించి, అన్నిచోట్ల సైన బోర్డులు ఏర్పాటు చేయాలి. ► ప్రమాదాలకు గురైన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించేందుకు వీలుగా ప్రధాన కూడళ్లలో అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలి. అంబులెన్స్ వివరాలు తెలియజేస్తూ వాహన యజమానులు, డ్రైవర్లకు ఎస్ఎంఎస్ చేయాలి. -
పూరీ మెచ్చిన వెరీ వెరీ స్పెషల్ బైక్
-
పూరీ మెచ్చిన వెరీ వెరీ స్పెషల్ హెల్మెట్ లెస్ బైక్
లగ్జూరియస్ అండ్ రాయల్ కార్లకు పెట్టింది పేరైన ప్రఖ్యాత కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ ఇపుడు బైక్ లవర్స్ కోసం సరికొత్త కాన్సెప్ట్ బైక్ లాంచ్ చేసింది. 'బీఎండబ్ల్యూ మోటోరాడ్ విజన్ నెక్స్ట్ 100' పేరుతో రిలీజ్ చేసిన ఈ బైక్ తన స్పెషల్ క్వాలిటీస్ తో పలువుర్ని ఆకట్టుకుంటోంది. కంపెనీ స్థాపించి వందేళ్లైన సందర్భంగా రూపొందించిన ఈ బైక్ ను హెల్మెట్ లేకుండా నడిపేయొచ్చట. అంతేకాదు ఇది దాదాపు డ్రైవర్ లెస్ కార్ తో సమానమైనదని అంటున్నారు తయారీదారులు. ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో నడిచే ఈ హెల్మెట్ లెస్ బైక్ ఇతర ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఈ స్పెషల్ మోటోరాడ్ బైక్ హెల్మెట్ గానీ, ప్రొటెక్టివ్ గేర్ అవసరంగానీ లేకుండానే రాబోయే ప్రమాదాన్ని ఊహించి దాని కనుగుణంగా మార్పులు చేసుకుంటుందనీ, జీరో ఎమిషన్స్, బాక్సర్ ఇంజీన్, కార్బన్ ఫైబర్ తో తయారు చేసిన సీట్, సెల్ఫ్ బ్యాలెన్సింగ్ సిస్టమ్ అండ్ నెవర్ క్రాష్ అని సగర్వంగా చెబుతోంది కంపెనీ. స్పెషల్ గా అందిస్తున్న ది విజర్ (అగమెంటెడ్ రియల్టీ హెడ్ సెట్) అనే గ్లాసెస్ కూడా మరో స్పెషాల్టీ. ఎందుకటే ఈ కళ్ళద్దాలు పెట్టుకుంటే చుట్టు పక్కల ప్రాంతాలపై స్పష్టత ఉండటంతో పాటు రోడ్ కండీషన్ కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటుంది. స్పీడ్, నావిగేషన్ రియర్ మిర్ర్రర్స్ ను ఇది చూపిస్తుంది. అయితే ఈ ఫీడ్ బ్యాక్ అందించడమనేది బైక్ నడిపే వారి అడ్జస్ట్ మెంట్ ను బట్టి ఆధారపడి ఉంటుందట. మరోవైపు టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఈ బైక్ కు సంబంధించిన యూ ట్యూబ్ వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేశారు. లేటెస్ట్ గ్యాడ్జెట్స్ అంటే ప్రాణం పెట్టే పూరి మనసును ఈ బీఎండబ్ల్యూ మోటోరాడ్ గెలుచుకోవడం విశేషమే మరి. BMW reveals the HELMET FREE motorcycle https://t.co/ZgbOp5Mj06 pic.twitter.com/vZCgYK3PXi — PURI JAGAN (@purijagan) October 13, 2016