పూరీ మెచ్చిన వెరీ వెరీ స్పెషల్ హెల్మెట్ లెస్ బైక్ | BMW just revealed a self-correcting motorcycle you can ride without a helmet | Sakshi
Sakshi News home page

పూరీ మెచ్చిన వెరీ వెరీ స్పెషల్ హెల్మెట్ లెస్ బైక్

Oct 13 2016 11:15 AM | Updated on Sep 4 2017 5:05 PM

పూరీ మెచ్చిన వెరీ వెరీ స్పెషల్  హెల్మెట్ లెస్ బైక్

పూరీ మెచ్చిన వెరీ వెరీ స్పెషల్ హెల్మెట్ లెస్ బైక్

ప్రఖ్యాత కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ బైక్ లవర్స్ కోసం సరికొత్త కాన్సెప్ట్ బైక ను లాంచ్ చేసింది. 'బీఎండబ్ల్యూ మోటోరాడ్ విజన్ నెక్స్ట్ 100' పేరుతో రిలీజ్ చేసిన ఈ బైక్ తన స్పెషల్ క్వాలిటీస్ తో పలువుర్ని ఆకట్టుకుంటోంది.

లగ్జూరియస్  అండ్ రాయల్ కార్లకు పెట్టింది పేరైన ప్రఖ్యాత కార్ల కంపెనీ   బీఎండబ్ల్యూ ఇపుడు బైక్ లవర్స్ కోసం సరికొత్త కాన్సెప్ట్ బైక్  లాంచ్ చేసింది. 'బీఎండబ్ల్యూ మోటోరాడ్ విజన్ నెక్స్ట్ 100' పేరుతో  రిలీజ్ చేసిన ఈ  బైక్ తన స్పెషల్ క్వాలిటీస్ తో పలువుర్ని ఆకట్టుకుంటోంది.  కంపెనీ స్థాపించి వందేళ్లైన సందర్భంగా  రూపొందించిన ఈ బైక్ ను హెల్మెట్ లేకుండా నడిపేయొచ్చట.  అంతేకాదు ఇది దాదాపు డ్రైవర్ లెస్ కార్ తో సమానమైనదని అంటున్నారు తయారీదారులు.  ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో నడిచే ఈ హెల్మెట్ లెస్ బైక్ ఇతర  ప్రత్యేకతల విషయానికి వస్తే..

ఈ స్పెషల్  మోటోరాడ్ బైక్  హెల్మెట్ గానీ, ప్రొటెక్టివ్ గేర్ అవసరంగానీ లేకుండానే   రాబోయే ప్రమాదాన్ని ఊహించి దాని కనుగుణంగా మార్పులు చేసుకుంటుందనీ,   జీరో ఎమిషన్స్, బాక్సర్ ఇంజీన్, కార్బన్ ఫైబర్ తో తయారు చేసిన సీట్, సెల్ఫ్ బ్యాలెన్సింగ్ సిస్టమ్  అండ్  నెవర్ క్రాష్ అని  సగర్వంగా చెబుతోంది కంపెనీ. స్పెషల్ గా అందిస్తున్న ది విజర్ (అగమెంటెడ్ రియల్టీ హెడ్ సెట్) అనే గ్లాసెస్ కూడా మరో స్పెషాల్టీ.  ఎందుకటే ఈ కళ్ళద్దాలు పెట్టుకుంటే చుట్టు పక్కల ప్రాంతాలపై స్పష్టత ఉండటంతో పాటు రోడ్ కండీషన్ కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటుంది. స్పీడ్, నావిగేషన్ రియర్ మిర్ర్రర్స్ ను ఇది చూపిస్తుంది.  అయితే ఈ  ఫీడ్ బ్యాక్ అందించడమనేది బైక్ నడిపే వారి అడ్జస్ట్ మెంట్ ను బట్టి ఆధారపడి ఉంటుందట.
మరోవైపు టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఈ బైక్ కు సంబంధించిన యూ  ట్యూబ్ వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేశారు.  లేటెస్ట్  గ్యాడ్జెట్స్ అంటే ప్రాణం పెట్టే పూరి మనసును ఈ బీఎండబ్ల్యూ మోటోరాడ్ గెలుచుకోవడం విశేషమే మరి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement