సిబల్ ఇంటి అద్దె 16 లక్షలు | Kapil Sibal to pay Rs 16 lakh per month for luxurious house in Lutyens' Delhi | Sakshi
Sakshi News home page

సిబల్ ఇంటి అద్దె 16 లక్షలు

Jun 25 2014 1:45 AM | Updated on Sep 2 2017 9:20 AM

సిబల్ ఇంటి అద్దె 16 లక్షలు

సిబల్ ఇంటి అద్దె 16 లక్షలు

కేంద్ర మాజీ మంత్రి, న్యాయవాది కపిల్ సిబల్ ఢిల్లీలోని లీఫీ లత్యెన్స్ జోన్‌లో ఉన్న రాజప్రాసాదం లాంటి అద్దె భవనంలోకి త్వరలో మారనున్నారు. ఈ భవనం అద్దె నెలకు రూ. 16 లక్షలు.

ఢిల్లీలోనే అత్యంత భారీ అద్దె చెల్లించే ఇల్లు ఇదే!
 న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, న్యాయవాది కపిల్ సిబల్ ఢిల్లీలోని లీఫీ లత్యెన్స్ జోన్‌లో ఉన్న రాజప్రాసాదం లాంటి అద్దె భవనంలోకి  త్వరలో మారనున్నారు. ఈ భవనం అద్దె నెలకు రూ. 16 లక్షలు. ఢిల్లీలోని ప్రముఖ వ్యాపారి సిద్ధార్థ్ శరీన్‌కు చెందిన ఈ భవనాన్ని అద్దెకు తీసుకోవడానికి ఒప్పందం ఇప్పటికే పూర్తయినట్టు శరీన్ సన్నిహితుల ద్వారా తెలిసింది.
 
 అద్దెను నెలకు రూ.18 లక్షలుగా అనుకున్నప్పటికీ మధ్యేమార్గంగా రూ. 16 లక్షలు చెల్లించేందుకు సిబల్ అంగీకరించారన్నారు. కాగా, ఢిల్లీ నగరంలో అత్యంత భారీస్థాయిలో అద్దె చెల్లించే భవనం ఇదే కావడం విశేషం. ఆగస్టు 1కి ముందే ప్రస్తుతం నివాసముంటున్న తీన్ మూర్తి రోడ్డులోని ప్రభుత్వ బంగ్లా నుంచి ఖాళీ చేయనున్నట్టు సిబల్ వెల్లడించారు. 1250 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించిన అద్దె భవనంలో సిబల్ లా ప్రాక్టీస్ చేసుకునేందుకు ఒక కార్యాలయం కూడా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement