అరుదైన ఘనత సాధించిన మాధురి కనిత్కర్‌

Kanitkars Become First Ever 3 Star Couple in Indian Forces - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు నాలుగు దశాబ్ధాలపాటు ఇండియన్‌ ఆర్మీలో పనిచేసిన మేజర్‌ జనరల్‌ మాధురి కనిత్కర్‌ అరుదైన ఘనత సాధించారు. పదోన్నతిలో భాగంగా సైన్యంలో లెఫ్టినెంట్‌ జనరల్‌ హోదా పొందిన మూడవ మహిళగా గుర్తింపుపొందారు. అదే సమయంలో ఆర్మీలో రెండవ అత్యున్నత పదవిని సాధించిన మొదటి మహిళా పీడియాట్రిషియన్‌గా ఘనత సాధించారు. మేజర్ జనరల్ మాధురి కనిత్కర్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కింద నియమించబడ్డారు. ఇది కేటాయించిన బడ్జెట్ వినియోగాన్ని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఉమ్మడి ప్రణాళిక, సమైక్యత ద్వారా సేవల సేకరణ, శిక్షణ కార్యకలాపాలలో మరింత కృషి చేయనున్నారు. పూణే సాయుధ దళాల మెడికల్ కాలేజీ మాజీ డీన్ మేజర్ జనరల్ మాధురి కనిత్కర్‌ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రధాన కార్యాలయానికి పంపారు. మేజర్ జనరల్ మాధురి కనిత్కర్, లెఫ్టినెంట్ జనరల్ అయిన ఆమె భర్త రాజీవ్ సాయుధ దళాలలో ర్యాంకు సాధించిన మొదటి జంటగా గుర్తింపు పొందారు. చదవండి: ‘నమస్తే ట్రంప్‌; నేను ఎగ్జయిట్‌ కాలేదు’ 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top