జయలలిత అక్రమాస్తుల కేసు విచారణ సుదీర్ఘంగా 18 సంవత్సరాల పాటు పట్టింది.
జయలలిత అక్రమాస్తుల కేసు విచారణ సుదీర్ఘంగా 18 సంవత్సరాల పాటు పట్టింది. తమిళనాడులోనే విచారణ జరిగితే అది సవ్యంగా సాగదని, అందువల్ల వేరే రాష్ట్రంలో విచారించాలని డీఎంకే పట్టుబట్టడమే ఇందుకు ప్రధాన కారణం. డీఎంకే వాదనతో సుప్రీంకోర్టు అంగీకరించడంతో.. కేసును బెంగళూరుకు మార్చారు. నిందితులు కూడా లెక్కలేనన్ని పిటిషన్లు దాఖలు చేశారు. దాదాపు కేసు ముగింపు దశకు వచ్చేస్తుందన్న సమయంలో ముఖ్యమంత్రికి ఏకంగా 1339 ప్రశ్నలు సంధించారు. ఇవన్నీ కూడా ఆలస్యానికి కారణాలే. బెంగళూరు కోర్టుకు కేసును బదిలీ చేయడానికే ఆరేళ్ల సమయం పట్టేసింది.
76 మంది ప్రాసిక్యూషన్ సాక్షులను విచారించారు. వాళ్లందరినీ ఒకసారి అప్పటికే క్రాస్ ఎగ్జామిన్ చేసేశారు. వాళ్లలో 64 మంది ప్రాసిక్యూషన్కు ఎదురు తిరిగారు. తమతో బలవంతంగా సాక్ష్యం చెప్పించారన్నారు. ఈ 18 ఏళ్లలో కేసు విచారణకు జయలలిత కేవలం రెండంటే రెండేసార్లు హాజరయ్యారు. ఒక సందర్భంలో అయితే.. ప్రాసిక్యూషన్ నిందితులతో చేతులు కలిపిందని సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. దాంతో ఒక్కసారిగా వ్యవస్థ మొత్తం ఉలిక్కిపడింది. అలా విచారణకు సుదీర్ఘ కాలం పట్టేసింది.