అరబిందో చేతికి జనరిస్‌ ఫార్మా | Janaris Pharma to the hand of Aurobindo | Sakshi
Sakshi News home page

అరబిందో చేతికి జనరిస్‌ ఫార్మా

Jan 8 2017 3:52 AM | Updated on Sep 5 2017 12:41 AM

పోర్చుగల్‌ కేంద్రంగా పనిచేస్తున్న జనరిక్‌ ఔషధ కంపెనీ ‘జనరిస్‌ ఫార్మాస్యూటికా’ను అరబిందో ఫార్మా సొంతం చేసుకుంది

రూ.969 కోట్లతో కొనుగోలుకు ఒప్పందం  

న్యూఢిల్లీ: పోర్చుగల్‌ కేంద్రంగా పనిచేస్తున్న జనరిక్‌ ఔషధ కంపెనీ ‘జనరిస్‌ ఫార్మాస్యూటికా’ను అరబిందో ఫార్మా సొంతం చేసుకుంది. 135 మిలియన్‌ యూరోలు చెల్లించి దీన్ని సొంతం చేసుకోవటానికి ఒప్పందం చేసుకుంది. ఇది మన కరెన్సీలో దాదాపు రూ.969 కోట్లు. ప్రస్తుతం ఈ సంస్థ మాగ్నమ్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌ చేతిలో ఉంది. తన అనుబంధ సంస్థ ఏజైల్‌ ఫార్మా నెదర్లాండ్స్‌ ద్వారా ఈ కొనుగోలు ఒప్పందం చేసుకున్నట్లు అరబిందో యూరోపియన్‌ ఆపరేషన్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వి.మురళీధరన్‌  చెప్పారు.

ఈ రెండు సంస్థలకూ సంబంధించి పలు ఔషధాల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో వచ్చే అయిదేళ్లలో మరిన్ని పేటెంట్‌లు వస్తాయని ఆయన తెలియజేశారు. యూరోపియన్‌ మార్కెట్‌లో తమ స్థానాన్ని పటిష్ఠం చేసుకోవటానికి కట్టుబడి ఉన్నామని, తాజా కొనుగోలు కూడా దీన్నే సూచిస్తుందని చెప్పారాయన. ఈ  ఒప్పందానికి  పోర్చుగీసు నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఒప్పందంతో పోర్చుగల్‌లోని అమడొరాలో ఉన్న 1.2 బిలియన్‌ ట్యాబ్లెట్స్‌ను ఉత్పత్తి చేసే ప్లాంటు అరబిందో సొంతమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement