రెండు వారాల్లో రూ.3,285కోట్లు డ్రా చేశారు | Jan Dhan a/c holders withdrew Rs 3,285cr in last fortnight | Sakshi
Sakshi News home page

రెండు వారాల్లో రూ.3,285కోట్లు డ్రా చేశారు

Jan 1 2017 4:59 PM | Updated on Apr 3 2019 5:16 PM

రెండు వారాల్లో రూ.3,285కోట్లు డ్రా చేశారు - Sakshi

రెండు వారాల్లో రూ.3,285కోట్లు డ్రా చేశారు

పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత వారానికి రూ.24వేలు కూడా డ్రా చేసుకోలేని పరిస్థితి. అలాంటిది కేవలం రెండు వారాల్లోనే దాదాపు రూ.3,285కోట్లను డ్రా చేసి ఐటీ అధికారులను అవాక్కయ్యేలా చేశారు.

న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత వారానికి రూ.24వేలు కూడా డ్రా చేసుకోలేని పరిస్థితి. అలాంటిది కేవలం రెండు వారాల్లోనే దాదాపు రూ.3,285కోట్లను డ్రా చేసి ఐటీ అధికారులను అవాక్కయ్యేలా చేశారు. అది కూడా జన్‌ ధన్‌ ఖాతాలో నుంచి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన తర్వాత జన్‌ ధన్‌ ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్‌ అయిన విషయం తెలిసిందే.

గత డిసెంబర్‌ 14నాటికి జన్‌ ధన్‌ ఖాతాల్లో మొత్తం రూ.74,610కోట్లు ఉండగా అవికాస్తం పద్నాలుగు రోజులు గడిచిన తర్వాత రూ.71,037కోట్లకు తగ్గినట్లు ఆర్థికశాఖ సేకరించిన సమాచారం ప్రకారం తెలిసింది. మొత్తం రూ.3,285కోట్లను రెండు వారాల్లో డ్రా చేయడం గతంలో ఉన్న పరిస్థితుల కంటే ఇదే తొలిసారి అని ఆర్ధికశాఖ అధికారులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement