'పత్రికా స్వేచ్ఛకు పునరంకితమవుదాం' | Jaitley extends wishes on World Press Freedom Day | Sakshi
Sakshi News home page

'పత్రికా స్వేచ్ఛకు పునరంకితమవుదాం'

May 3 2015 6:10 PM | Updated on Sep 3 2017 1:21 AM

'పత్రికా స్వేచ్ఛకు పునరంకితమవుదాం'

'పత్రికా స్వేచ్ఛకు పునరంకితమవుదాం'

రాజ్యాంగంలోని స్వాతంత్ర్య భావాలను సమున్నతంగా భావించి ప్రతిఒక్కరు పత్రికా స్వేచ్ఛకు పునరంకితం కావాలని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పిలుపునిచ్చారు.

రాజ్యాంగంలోని స్వాతంత్ర్య భావాలను సమున్నతంగా భావించి ప్రతిఒక్కరు పత్రికా స్వేచ్ఛకు పునరంకితం కావాలని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి  అరుణ్ జైట్లీ పిలుపునిచ్చారు. ఆదివారం (మే 3) ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలు, మీడియా ప్రతినిధులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

'ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తీర్మానం మేరకు మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. పత్రికా స్వేచ్ఛను నిర్ధారించడం తద్వారా సామాజిక అభివృద్ధి ప్రోత్సాహక కార్యక్రమాలు ఈ రోజు నిర్వహించుకుటున్నాం. మనందరం పత్రికా స్వేచ్ఛకు పునరంకితమవుదాం' అని జైట్లీ ఫేస్బుక్ ద్వారా సందేశం తెలిపారు. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement