లాకర్లు కావవి.. వజ్రాల గనులు | IT officers found Rs.100 crores worth diamonds | Sakshi
Sakshi News home page

లాకర్లు కావవి.. వజ్రాల గనులు

Dec 1 2014 12:12 PM | Updated on Sep 27 2018 4:47 PM

లాకర్లు కావవి.. వజ్రాల గనులు - Sakshi

లాకర్లు కావవి.. వజ్రాల గనులు

ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఇంజనీర్ యాదవ్ సింగ్ అవినీతి కేసులో కళ్లు బైర్లుకమ్మే వాస్తవాలు బయటపడుతున్నాయి.

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఇంజనీర్ యాదవ్ సింగ్ అవినీతి కేసులో కళ్లు బైర్లుకమ్మే వాస్తవాలు బయటపడుతున్నాయి. ఐటీ అధికారులు సోమవారం యాదవ్కు చెందిన 12 బ్యాంక్ లాకర్లు తెరిచారు. లాకర్లలో 100 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు, రెండు కిలోల బంగారం, 10 కోట్ల రూపాయల నగదు బయటపడ్డాయి.

వీటిని చూసి ఐటీ అధికారులు విస్తుపోయారు. ఓ సాధారణ ఇంజనీర్ ఇన్ని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడటం గమనార్హం. యాదవ్ గతంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి సన్నిహితంగా ఉండేవాడు. మాయావతి ప్రభుత్వంలో యాదవ్ అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

చదవండి (కారులో 12 కోట్లు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement