breaking news
yadav singh
-
అవినీతి అధికారిపై నల్లధన సిట్ దృష్టి
న్యూఢిల్లీ: నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాధికార సంస్థ మాజీ చీఫ్ ఇంజనీర్ యాదవ్‌సింగ్ ఇంటిపై ఇటీవల ఐటీశాఖ జరిపిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడిన నేపథ్యంలో నల్లధనంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆయనపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా సింగ్ ఇంట్లోంచి స్వాధీనం చేసుకున్న నగదు వివరాలపై నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్‌ను శనివారం ఆదేశించింది. సింగ్‌పై మనీలాండరింగ్ అభియోగాలు నమోదు చేసేందుకు వీలుగా ఈడీతో సమాచారం పంచుకోవాలని ఐటీ అధికారులకు సూచించింది. యాదవ్‌ను సిట్ ప్రశ్నించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. యాదవ్ వద్ద నుంచి సుమారు రూ. 100 కోట్ల విలువైన వజ్రాలు, రెండు కిలోల బంగారం, కోట్ల రూపాయల నగదును ఐటీ అధికారులు గత నెల తనిఖీల్లో స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. -
లాకర్లు కావవి.. వజ్రాల గనులు
-
లాకర్లు కావవి.. వజ్రాల గనులు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఇంజనీర్ యాదవ్ సింగ్ అవినీతి కేసులో కళ్లు బైర్లుకమ్మే వాస్తవాలు బయటపడుతున్నాయి. ఐటీ అధికారులు సోమవారం యాదవ్‌కు చెందిన 12 బ్యాంక్ లాకర్లు తెరిచారు. లాకర్లలో 100 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు, రెండు కిలోల బంగారం, 10 కోట్ల రూపాయల నగదు బయటపడ్డాయి. వీటిని చూసి ఐటీ అధికారులు విస్తుపోయారు. ఓ సాధారణ ఇంజనీర్ ఇన్ని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడటం గమనార్హం. యాదవ్ గతంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి సన్నిహితంగా ఉండేవాడు. మాయావతి ప్రభుత్వంలో యాదవ్ అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. చదవండి (కారులో 12 కోట్లు..)