ఆ రైలు టిక్కెట్‌ ధర అక్షరాల రూ.2లక్షలు

IRCTC Introduced Luxury Indian Saloon Coaches For Long Journey - Sakshi

న్యూఢిల్లీ : రైలులో దూర ప్రయాణాలు చేసే వారికి శుభవార్త. రోజుల తరబడి చేసే ట్రైన్‌ జర్నీలు ఇప్పుడు సాఫీగా సాగిపోతాయి. ఇరుకిరుకు బోగీలలో అష్టకష్టాలు పడాల్సిన అవసరం లేదు. దూర ప్రయాణాలు చేసేవారి కోసం ‘‘ఇండియన్‌ రైల్వే కాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పోరేషన్‌’’ (ఐఆర్‌సీటీసీ) కొత్తగా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లతో విలాసవంతమైన  ‘‘స్వాంకీ సెలూన్‌ కోచ్‌’లను అందుబాటులోకి తెచ్చింది. ఈ బోగీలలో మీ ప్రయాణం ఎలా ఉంటుందంటే.. విశాలమైన ఏసీ గదులు, రూమ్‌ విత్‌ పర్నిచర్‌, అటాచ్డ్‌ బాత్‌రూం, పిలవగానే వచ్చే సేవకులు. మొత్తానికి ఓ లగ్జరీ హోటల్లో సూట్‌ రూమ్‌ బుక్‌ చేసుకున్నట్లు ఉంటుంది.

సామాన్య పౌరునికి కూడా విలాసవంతమైన ప్రయాణాన్ని అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఐఆర్‌సీటీసీ వీటిని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ బోగీలను ఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని జమ్మూ మేయిల్‌తో పాటు జతచేసి నడుపుతున్నారు. మొత్తం 336 సెలూన్‌ కోచ్‌లు ఉండగా వాటిలో 66ఏసీవి. ‘‘స్వాంకీ సెలూన్‌ కోచ్‌’లలో ప్రయాణించడానికి ‘‘ఐఆర్‌సీటీసీ’’ వెబ్‌సైట్‌లో వెళ్లి ఓ టిక్కెట్‌ బుక్‌ చేసుకుంటే సరి. ధర విషయానికొస్తే లగ్జరీ అంటున్నాం కాబట్టి.. డబ్బులు కూడా లగ్జరీకి తగ్గట్టుగానే చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో టిక్కెట్‌ ధర అక్షరాల రూ. 2లక్షలు.. 18 ఫస్ట్‌క్లాస్‌ టిక్కెట్లతో సమానం. అంటే ‘‘స్వాంకీ సెలూన్‌ కోచ్‌’లో ఒక్క టిక్కెట్‌ కొంటే ఫస్ట్‌క్లాస్‌ బోగీలలో 18సార్లు ప్రయాణించవచ్చు.  
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top