‘కోటిన్నర ఉద్యోగాలు కల్పించే సత్తా ఉంది’ | Sakshi
Sakshi News home page

‘కోటిన్నర ఉద్యోగాలు కల్పించే సత్తా ఉంది’

Published Fri, Sep 15 2017 4:26 PM

‘కోటిన్నర ఉద్యోగాలు కల్పించే సత్తా ఉంది’

సాక్షి,బెంగళూర్ః ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) వంటి నూతన టెక్నాలజీలకు కోటిన్నర ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యం ఉందని టెలికాం కార్యదర్శి అరుణా బహుగుణ అన్నారు. కొత్త ఉద్యోగాల కల్పనలో ఐటీ రంగం వెనుకబడి ఉన్నా నూతన టెక్నాలజీలతో ఆ లోటు పూడ్చుకోవచ్చన్నారు. దేశంలోని బెంగళూర్‌ ఇతర ప్రాంతాల్లో ఐటీ అవకాశాలపై ఆందోళన వ్యక్తమవుతున్నా కేవలం ఐఓటీ ద్వారానే ఈ స్ధాయిలో ఉద్యోగాలు సమకూర్చుకోవచ్చన్నారు. 
 
ఐఓటీ ఇండియా కాంగ్రెస్‌ సదస్సు సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఐఓటీకి పెద్దసంఖ్యలో ఉద్యోగాలను సృష్టించగల సత్తా ఉందంటూ, ఈ జాబ్‌లు బడా కంపెనీల నుంచి కాక స్టార్టప్‌ల నుంచే ఎక్కువగా ఉంటాయని అంచనా వేశారు. ఐఓటీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం త్వరలో మెరుగైన విధానంతో ముందుకొస్తుందన్నారు. నూతన టెక్నాలజీలకు అవసరమైన భద్రతా ప్రోటోకాల్స్‌పై ఐటీ, టెలికాం మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు.

Advertisement
Advertisement