బాంబే అంటే బాంబు అనుకుని.. | Sakshi
Sakshi News home page

బాంబే అంటే బాంబు అనుకుని..

Published Fri, Jul 26 2019 7:20 PM

An Innocuous Call At Mumbai Airport Sparked Security Scare - Sakshi

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై పేరు గతంలో బాంబే కాగా ఆ పేరులో భయోత్పాతం కలిగించే శబ్ధం ఉండటంతో ఎవరు ఆ పేరును పిలిచినా ఉలిక్కిపడుతున్నారు. ఉద్యోగావకాశాల కోసం ఓ యువకుడు బొంబాయి విమానాశ్రయానికి ఫోన్‌ చేసి ఇది బాంబే ఎయిర్‌పోర్టేనా అని అడగటంతో  కాల్‌ రిసీవ్‌ చేసుకున్న కంట్రోల్‌ రూం సిబ్బందికి ‘బాంబ్‌ హై’ అని వినిపించడంతో విమానాశ్రయంలో కలకలం రేగింది. భద్రతా సిబ్బంది అప్రమత్తమై రెండు గంటల పాటు హడావిడి సాగింది. చివరికి విషయం తెలియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

గత ఏడాది సైతం ఇలాంటి ఘటనే జరగడం గమనార్హం. ఓ కాలర్‌ బాంబే=ఢిల్లీ విమానం గురించి అడుగతూ బామ్‌-డెల్‌ ఫ్లైట్‌ అనగానే రిసీవర్‌కు బాంబ్‌ హై అని వినపడటంతో భద్రతా సిబ్బంది బాంబు కోసం ఎయిర్‌పోర్ట్‌ను జల్లెడ పట్టాల్సి వచ్చింది. కాల్‌ చేసిన వ్యక్తిని అరెస్ట్‌ కూడా చేశారు. నకిలీ కాల్‌తో బెంబేలెత్తించాడనే అనుమానంతో అతడ్ని పలు ప్రశ్నతలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. బాంబే-ఢిల్లీ విమానాన్ని ఏవియేషన్‌ కోడ్స్‌లో బామ్‌-డెల్‌గా వ్యవహరిస్తారని తాను అలాగే ఉచ్ఛరించానని కాల్‌ చేసిన వ్యక్తి నింపాదిగా చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement