
కరోనా వైరస్‌తో గడిచిన 24 గంటల్లో 648 మంది మరణించారు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,724 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 11,92,915కు ఎగబాకింది. మహమ్మారి బారినపడి కోలుకున్న వారి సంఖ్య 7,53,050కి పెరగడం ఊరట ఇస్తోంది. దేశంలో మొత్తం 4,11,133 యాక్టివ్ కేసులున్నాయి. ప్రాణాంతక వైరస్‌తో గడిచిన 24 గంటల్లో 648 మంది మరణించడంతో కరోనా మరణాల సంఖ్య 28,732కి చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈనెల 21 వరకూ 1,47,24,546 శాంపిళ్లను పరీక్షించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
ఇక కరోనా హాట్‌స్పాట్‌గా మారిన మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య మూడు లక్షల మార్క్ దాటింది. వైరస్ విస్తృతితో పలు రాష్ట్రాలు కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేస్తున్నాయి. వారం రోజుల పాటు పూర్తిగా లాక్‌డౌన్‌లో ఉన్న బెంగళూర్ నగరంలో బుధవారం నుంచి సాధారణ కార్యకలాపాలకు అనుమతించనున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాక్సిన్లపై జరుగుతున్న హ్యుమన్ ట్రయల్స్ విజయవంతమవుతుండటంతో వ్యాక్సిన్ల రాకపై ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదవండి : వ్యాక్సిన్ అభివృద్దిలో కీలక ముందడుగు