హాయిగా పడుకుంటే రూ. లక్ష గ్యారెంటీ..

Indian Startup Offers Sleep Internship Promises To Pay One lakh - Sakshi

న్యూఢిల్లీ: భారతీయ స్టార్టప్‌ ఓ వినూత్న కోర్సును ప్రవేశపెట్టింది. సాధారణంగా ఇంటర్న్‌షిప్‌ అంటే ఏ ఆర్నెళ్ల కోర్సు అని అనుకుంటారు కానీ ఇక్కడ నిద్రపోవడానికి శిక్షణ ఇస్తుండడం విశేషం. వివరాల్లోకి వెళితే.. స్లీప్‌ సొల్యూషన్స్‌ వేక్ ఫిట్ అనే స్టార్టప్‌ సంస్థ 2020 ఇంటర్న్‌షిప్‌ బ్యాచ్‌కు దరఖాస్తులు కోరింది. ఈ కోర్సుకు ఎంపికైన వారికి ఉపకార వేతనంగా లక్ష రూపాయలను ఇవ్వనున్నట్టు తెలిపారు. ఎవరికైనా స్వతహాగా నిద్రపోయే అభిరుచి ఉండి ఇచ్చిన సమయంలో నిద్రపోవడమే ఈ కోర్సుకు కావాల్సిన అర్హతలుగా సంస్థ పేర్కొంది. రోజుకు తొమ్మిది గంటలు వారానికి 100గంటలు నిద్రించాలని సంస్థ మార్గదర్శకాలను రూపొందించింది. ఈ కోర్సులో చేరే వారికి డ్రస్‌ కోడ్‌గా పైజామాను నిర్ణయించారు.

మరోవైపు దేశంలో ఎక్కువగా నిదించ్రేవారిని నియమించేందుకు ఈ కోర్సు ఎంతో ఉపకరిస్తుందని స్లీప్‌​ సొల్యుషన్స్‌ డైరెక్టర్‌ చైతన్య రామలింగగౌడ తెలిపారు. గౌడ మాట్లాడుతూ..ఇంటర్న్‌షిప్‌లో నిద్రపోయేందుకు మెళుకువలను నేర్పిస్తామని అన్నారు. అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ సెషన్స్‌ను నిర్వహిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు నిద్రపోయే ముందు, నిద్రపోయిన తర్వాత వారి అనుభవాలు తెలుసుకోనున్నట్లు ఆయన తెలిపారు. జీవితంలో అనుకున్న పనిని సమర్థవంతంగా నిర్వర్తించాలంటే నిద్ర  అనేది చాలా ముఖ్యమైనదని అన్నారు.  ఇలాంటి వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిర్ణీత సమయం నిద్రించడం.. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top