పాక్‌కు భారత్‌ హెచ్చరిక

Indian Army Warns Pakistan Against Killing Civilians - Sakshi

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్తాన్‌ అదనపు బలగాల్ని మోహరించడంపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తూ జనావాస ప్రాంతాలు లక్ష్యంగా దాడులకు దిగొద్దని హెచ్చరించింది. పుల్వామా, బాలాకోట్‌ ఘటనల తరువాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో పాకిస్తాన్‌ తన బలగాలు, ఆయుధ సంపత్తిని అఫ్గానిస్తాన్‌ సరిహద్దుల నుంచి నియంత్రణ రేఖ వైపు తరలిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం భారత్‌ స్పందిస్తూ.. పాకిస్తాన్‌ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరికలు జారీచేసింది. (ఫేక్‌ వీడియోతో అడ్డంగా దొరికిపోయిన పాక్‌)

ఎల్‌వోసీ వెంట సామాన్య పౌరులు లక్ష్యంగా మోర్టార్‌ దాడులకు దిగొద్దని మంగళవారం హాట్‌లైన్‌ ద్వారా జరిపిన సంభాషణలో భారత అధికారులు పాక్‌ను హెచ్చరించారు. ఎల్‌వోసీ, అంతర్జాతీయ సరిహద్దులో నిఘాను పటిష్టం చేశారు. పాకిస్తాన్‌ నుంచి ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు ఎదురైనా దీటుగా తిప్పికొడతామని ఆర్మీ తెలిపింది. (‘బాలాకోట్‌’ సాక్ష్యాలివిగో!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top