ఆ సూచీలో భారత్‌కు మెరుగైన ర్యాంక్‌

India Climbs One Spot In Human Development Index - Sakshi

న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచికలో ఈ ఏడాది భారత్‌ ర్యాంక్‌ స్వల్పంగా మెరుగుపడింది. గత ఏడాది మానవాభివృద్ధి సూచికలో 189 దేశాలకు గాను 130వ స్ధానంలో నిలిచిన భారత్‌ ఈ ఏడాది ఒక స్ధానం మెరుగపడి 129వ స్ధానానికి చేరింది. 2005-06 నుంచి 2015-16 మధ్యలో భారత్‌లో 27 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని యూఎన్‌డీపీ ఇండియా స్ధానిక ప్రతినిధి శోకో నోడా చెప్పారు. మూడు దశాబ్ధాలుగా భారత్‌లో చోటుచేసుకుంటున్న వేగవంతమైన అభివృద్ధితో భారత్‌లో పేదరికం గణనీయంగా తగ్గిందని, జీవనకాలం పెరగడంతో పాటు మెరుగైన విద్య, వైద్యం అందుబాటులోకి వచ్చాయని ఆమె పేర్కొన్నారు. 1990 నుంచి 2018 మధ్యలో దక్షిణాసియా ప్రాంతం 46 శాతం మేర సత్వర వృద్ధి సాధించిందని ఆ తర్వాత తూర్పు ఆసియా, ఫసిఫిక్‌ ప్రాంతాలు 43 శాతం వృద్ధిని సాధించాయని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top