ఆరోగ్యంగానే ఉన్నా: దిలీప్‌కుమార్ | i am Healthy: dilipkumar | Sakshi
Sakshi News home page

ఆరోగ్యంగానే ఉన్నా: దిలీప్‌కుమార్

Nov 26 2014 1:14 AM | Updated on Apr 3 2019 6:23 PM

ఆరోగ్యంగానే ఉన్నా: దిలీప్‌కుమార్ - Sakshi

ఆరోగ్యంగానే ఉన్నా: దిలీప్‌కుమార్

తనకు అస్వస్థత అంటూ వస్తున్న వార్తలన్నీ వదంతులేనని బాలీవుడ్ దిగ్గజం దిలీప్‌కుమార్

ముంబై: తనకు అస్వస్థత అంటూ వస్తున్న వార్తలన్నీ వదంతులేనని బాలీవుడ్  దిగ్గజం దిలీప్‌కుమార్ (91) కొట్టిపారేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ సోషల్ సైట్స్‌లో ఊహాగానాలు హల్‌చల్ చేశాయి.

దీంతో అజ్ఞాతం వీడిన దిలీప్...తన క్షేమం, ఆరోగ్యం కోరుకుంటున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై మౌత్‌షట్ డాట్ కామ్‌లో అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. కాగా, అమితాబ్ బచ్చన్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement