
తమిళనాడును ముంచెత్తిన భారీ వర్షాలు
చెన్నై : తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోతతో స్కూళ్లు, కాలేజీలను మంగళవారం మూసివేశారు. రామనాథపురం,కోయంబత్తూరు, కన్యాకుమారి సహా పలు జిల్లాల కలెక్టర్లు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భారీ వర్షాలతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్ధంభించింది. కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను రాష్ట్ర యంత్రాంగం ఆదేశించింది. నీలగిరి, కోయంబత్తూర్, థేని, దిండిగల్ జిల్లాల్లో రెడ్‌అలర్ట్ ప్రకటించారు. రానున్న అయిదు రోజుల్లో తమిళనాడు అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.