
న్యూఢిల్లీ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీచేయకపోవచ్చనే సంకేతాలను మాజీ ప్రధాని దేవె గౌడ (85) శుక్రవారం ఇచ్చారు. మధ్యంతర బడ్జెట్‌పై సోమవారం తాను లోక్‌సభలో మాట్లాడేదే తన చివరి ప్రసంగం
కావచ్చనీ, కాబట్టి ఆరోజున తనకు మరింత ఎక్కువ సమయం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా స్పీకర్‌ను కోరానని దేవెగౌడ తెలిపారు. బడ్జెట్‌పై చర్చ సమయంలో కాంగ్రెస్‌కు కేటాయించిన సమయంలోనూ తనకు కొంత ఇవ్వాలని తాను ఆ పార్టీని కోరతానన్నారు.
320 రోజులు ప్రధానిగా చేశాననీ, ఆ సమయంలో తాను దేశానికి ఏం చేసిందీ ఎక్కువ మందికి తెలీదు కాబట్టి పార్లమెంటులో దీనిపై మాట్లాడతానన్నారు. ప్రస్తుతం హసన్ లోక్‌సభ స్థానానికి దేవె గౌడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.