ఒబామా సేవకు 50 మంది హోటల్ సిబ్బంది | Handpicked hotel staff to look after Obama | Sakshi
Sakshi News home page

ఒబామా సేవకు 50 మంది హోటల్ సిబ్బంది

Jan 21 2015 8:15 PM | Updated on Sep 2 2017 8:02 PM

భారత పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఘనమైన ఆతిథ్యం ఇచ్చేందుకు చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు.

న్యూఢిల్లీ: భారత పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఘనమైన ఆతిథ్యం ఇచ్చేందుకు చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒబామా దంపతులు మూడు రోజుల పాటు ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్లో బస చేయనున్నారు. ఈ సందర్భంగా ఒబామా, మిచెల్ దంపతులకు సేవలు అందించేందుకు హోటల్ యాజమాన్యం 50 మంది సిబ్బందిని ఎంపిక చేశారు.  అవసరమైతే సేవలు అందించేందుకు మరో 20 మందిని సిద్ధంగా ఉంచింది.

ఒబామా దంపతులకు భోజనం, నీళ్లు సరఫరా చేయడం సహా వారికి అవసరమైన సేవలు అందించనున్నారు. భద్రత కారణాల రీత్యా వారి వివరాలను గోప్యంగా ఉంచారు. ఈ నెల 25 ఉదయం ఒబామా రానున్నారు. 2010లో ఒబామా భారత్ పర్యటనకు వచ్చినపుడు ఇదే హోటల్లో బస చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement