breaking news
Barack-Obama
-
ఒబామా సేవకు 50 మంది హోటల్ సిబ్బంది
న్యూఢిల్లీ: భారత పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఘనమైన ఆతిథ్యం ఇచ్చేందుకు చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒబామా దంపతులు మూడు రోజుల పాటు ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్లో బస చేయనున్నారు. ఈ సందర్భంగా ఒబామా, మిచెల్ దంపతులకు సేవలు అందించేందుకు హోటల్ యాజమాన్యం 50 మంది సిబ్బందిని ఎంపిక చేశారు. అవసరమైతే సేవలు అందించేందుకు మరో 20 మందిని సిద్ధంగా ఉంచింది. ఒబామా దంపతులకు భోజనం, నీళ్లు సరఫరా చేయడం సహా వారికి అవసరమైన సేవలు అందించనున్నారు. భద్రత కారణాల రీత్యా వారి వివరాలను గోప్యంగా ఉంచారు. ఈ నెల 25 ఉదయం ఒబామా రానున్నారు. 2010లో ఒబామా భారత్ పర్యటనకు వచ్చినపుడు ఇదే హోటల్లో బస చేశారు. -
ఆగ్రాకు అమెరికా భద్రతా సిబ్బంది
ఆగ్రా: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనకు అసాధారణ రీతిలో భద్రత ఏర్పాటు చేశారు. తన పర్యటనలో భాగంగా ఈనెల 27న ఒబామా తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రపంచ ప్రసిద్ధ కట్టడం తాజ్ మహల్ ను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో 100 మంది అమెరికా భద్రతా సిబ్బంది ఇక్కడకు చేరుకున్నారు. 4000 మంది భారత రక్షణ సిబ్బందితో కలిసి వీరు ఒబామాకు గ్రౌండ్ టు ఎయిర్ స్థాయిలో భద్రత కల్పిస్తారు. రక్షణ ఏర్పాట్లపై బుధవారం సమావేశం నిర్వహించారు. ఇంకా చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు.