ఆ రైల్లో ఇక అర లీటరు బాటిళ్లే

న్యూఢిల్లీ: నీటి వృథాను అరికట్టే ప్రయత్నంలో భాగంగా శతాబ్ది రైళ్లలో ప్రయాణించేవారికి ఒక లీటరు ‘రైల్‌నీర్’ నీటి సీసాల బదులు అరలీటరు నీటి సీసాలను ఇవ్వాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మేరకు 8.5 గంటల్లోపు ప్రయాణం చేసే శతాబ్ది రైళ్లలో ఇకపై ఒక లీటర్ నీటి సీసాలను ఇవ్వవద్దని ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం శతాబ్ది రైల్లో 5 గంటల ప్రయాణం చేసే వారికి అరలీటరు సీసాలను, అంతకంటే ఎక్కువ సేపు ప్రయాణం చేసేవారికి ఒక లీటరు నీటి సీసాలను అందిస్తున్నారు. నూతన ఆదేశాల ప్రకారం ప్రయాణికులు అడిగితే అదనపు సీసాలు ఇస్తామని, కానీ వాటికి నగదు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి