breaking news
sathabdi express
-
ఆ రైల్లో ఇక అర లీటరు బాటిళ్లే
న్యూఢిల్లీ: నీటి వృథాను అరికట్టే ప్రయత్నంలో భాగంగా శతాబ్ది రైళ్లలో ప్రయాణించేవారికి ఒక లీటరు ‘రైల్‌నీర్’ నీటి సీసాల బదులు అరలీటరు నీటి సీసాలను ఇవ్వాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మేరకు 8.5 గంటల్లోపు ప్రయాణం చేసే శతాబ్ది రైళ్లలో ఇకపై ఒక లీటర్ నీటి సీసాలను ఇవ్వవద్దని ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం శతాబ్ది రైల్లో 5 గంటల ప్రయాణం చేసే వారికి అరలీటరు సీసాలను, అంతకంటే ఎక్కువ సేపు ప్రయాణం చేసేవారికి ఒక లీటరు నీటి సీసాలను అందిస్తున్నారు. నూతన ఆదేశాల ప్రకారం ప్రయాణికులు అడిగితే అదనపు సీసాలు ఇస్తామని, కానీ వాటికి నగదు చెల్లించాల్సి ఉంటుందన్నారు. -
‘శతాబ్ది’టికెట్ ధరలు తగించాలి
అనంతపురం న్యూసిటీ: శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో డైనమిక్ పేరుతో చార్జీలు అధికంగా వసూలు చేస్తున్నారని తక్షణం ఆ టికెట్ ధరలు తగ్గించాలని ఎస్‌యూసీఐ(సీ) నగర కార్యదర్శి రాఘవేంద్ర డిమాండ్ చేశారు. శుక్రవారం అనంతపురం రైల్వే స్టేషన్ మేనేజర్ తిప్పానాయక్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌యూసీఐ నాయకులు సుబ్రమణ్యం, తబ్రేజ్, నాగేంద్ర తదితరులున్నారు.