నేడు అంతరిక్షంలోకి జీఎస్‌ఎల్‌వీ

నేడు అంతరిక్షంలోకి జీఎస్‌ఎల్‌వీ


శ్రీహరికోట(సూళ్లూరుపేట)/సాక్షి,తిరుమల: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం సాయంత్రం 4.57 నిమిషాలకు జీఎస్‌ ఎల్‌వీ ఎఫ్‌09 ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించనున్నారు. దీనికి సంబంధించి గురువారం మధ్యా హ్నం 12.57 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభ మైంది. ఈ రాకెట్‌ ద్వారా 2,230 కిలోల బరువు కలిగిన విశాట్‌–9(దక్షిణాసియా దేశాల శాటిలైట్‌) ఉపగ్రహాన్ని భూమికి 36వేల కి.మీ ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్ర హంలో 12 కేయూ బ్రాండ్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌ను అమర్చారు. దక్షిణాసియా దేశాలైన శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, భారత్, మాల్దీవులు దేశాలకు ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు సేవలందించనుంది.



జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఇది 11వ ప్రయోగం కావడం విశేషం. ఇప్పటివరకు నిర్వహిం చిన 10 ప్రయోగాల్లో 3 విఫలం కాగా 7 విజయవం తమయ్యాయి. జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఎంతో సంక్లిష్టమైన క్రయోజనిక్‌ దశను స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు.  3 సార్లు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో వరుసగా ప్రయోగాలు నిర్వహించిన శాస్త్రవేత్తలు నాలుగోసారి ప్రయోగా నికి సిద్ధమవుతున్నారు. ఉపగ్రహ ప్రయోగంపై ఇస్రో చైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ చెన్నైలో విలేకర్లతో మాట్లాడుతూ ప్రయోగ పనులన్నీ సజావుగా జరుగుతున్నాయని చెప్పారు. శుక్రవారం జరిగే ప్రయోగానికి మీడియాకు ఎలాంటి ప్రవేశం లేదని ఇస్రో వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. కాగా ప్రయోగం నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయం లో గురువారం ఇస్రో డైరెక్టర్లు, సిబ్బంది జీఎస్‌ఎల్‌ వీ ఎఫ్‌09 నమూనా రాకెట్‌తో పూజలు చేశారు.



మార్క్‌–3 పనులపై ఎంఆర్‌ఆర్‌ సమావేశం

సతీష్‌ధావన్‌ స్పేస్‌సెంటర్‌ (షార్‌)లోని కల్పన అతిథి భవనంలో జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 ప్రయోగ పనులపై ఇస్రో చైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ ఆధ్వ ర్యంలో మిషన్‌ సంసిద్ధతా సమావేశం(ఎంఆర్‌ఆర్‌) నిర్వహించారు. ఈ నెల 30న ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రయోగ పనులపై ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. రెండో ప్రయోగ వేదికకు సంబంధించిన సాలిడ్‌ స్టేజ్‌ అసెంబ్లీ బిల్డింగ్‌ (ఎస్‌ఎస్‌ఏబీ)లో రెండు దశల రాకెట్‌ అనుసం« దానాన్ని ఆయన పరిశీలించారు.


జీఎస్‌ ఎల్‌వీ ఎఫ్‌09 ప్రయోగం ముగిసిన వెంటనే మార్క్‌–3 ప్రయోగానికి సిద్ధంగా ఉండాలని శాస్త్రవేత్తలకు సూచించారు. ఈ సమావేశంలో షార్‌ డైరెక్టర్‌ పి.కున్హికృష్ణన్, విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.శివన్, ఐసాక్‌ డైరెక్టర్‌ ఎం.అన్నాదొరై, ఎల్‌పీఎస్‌ఈ డైరెక్టర్‌ ఎస్‌.సోమ నాథ్‌తో పాటు పలు సెంటర్ల డైరెక్టర్లు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top