
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్నాధ్ సింగ్తో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మంగళవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు రాష్ట్రాల రాజకీయ, పరిపాలన పరిస్థితులపై నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. ‘ఇది సాధారణ సమావేశమే. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధల్లాంటివి. పెద్దలు, పిల్లల్ల మధ్య తలెత్తే అపార్దాలు మళ్లీ సర్దుకుంటాయి. విభజన చట్టంలో కొన్ని మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. రాజ్ భవన్ పనితీరును మరింత మెరుగు పరిచేందుకు కొన్ని సూచనలు చేశాం. ప్రజలకు రాజ్భవన్‌ను మరింత చేరువ చేస్తాం, పచ్చదనం-పరిశుభ్రత అంశాలపై దృష్టి పెట్టాం.’ అని తెలిపారు.