గవర్నర్‌ కీలుబొమ్మా?

Is governor a mere puppet - Sakshi

బిహార్‌ సివిల్స్‌ పరీక్షలో జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్న

పట్నా: బిహార్‌లో ఆదివారం సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు జరిగాయి. జనరల్‌ నాలెడ్జ్‌ పరీక్ష రాస్తున్న అభ్యర్థులు ప్రశ్నపత్రంలోని ఒక ప్రశ్నను చూసి ఆశ్చర్యపోయారు. ‘ఇండియాలో, ప్రత్యేకించి బిహార్‌ రాజకీయాల్లో గవర్నర్‌ పాత్రను విశ్లేషించండి. గవర్నర్‌ కీలుబొమ్మా(కఠ్‌పుత్లీ)?’అన్నది ఆ ప్రశ్న. గవర్నర్‌ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అంటూ విపక్షాలు విమర్శించడం జరిగేదే. అయితే, ఏకంగా ప్రభుత్వ పరీక్షలో, అందులోనూ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో రావడంతో విద్యార్థులు విస్తుపోయారు. బిహార్‌ సర్వీస్‌ కమిషన్‌ అధికారులు ఈ తప్పును ప్రశ్నపత్రాన్ని రూపొందించిన అధ్యాపకుడిపైకి నెట్టేశారు. ‘ప్రశ్నలో తప్పేమీ లేదు.అయితే, కఠ్‌పుత్లీ పదాన్ని తీసేసి ఉంటే బాగుండేది’అని నసిగారు. గతంలో 8వతరగతి పరీక్షలో కశ్మీర్‌ను ఓ దేశంగా పేర్కొంటూ.. ‘చైనా, ఇండియా, నేపాల్, ఇంగ్లాండ్,  కశ్మీర్‌ దేశాల ప్రజలను ఏమని పిలుస్తారు?’ అన్న ప్రశ్న వచ్చింది. 2016లో ఇంటర్మీడియెట్‌లో ర్యాంకు సాధించిన రూబీరాయ్‌ పొలిటికల్‌ సైన్స్‌లో ‘వంట చేయడం’ ఉంటుందని చెప్పి షాక్‌ ఇచ్చింది. 2015లో పరీక్షరాసే విద్యార్థులకు కాపీలు అందించడం కోసం వారి బంధువులు పరీక్ష గది గోడలు ఎక్కడం తెల్సిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top