బీహార్‌ ప్రభుత్వం కీలక నిర్ణయాలు

Government Vehicles Older Than 15 Years Banned In Bihar - Sakshi

పాట్నా : బీహార్‌లో నితీశ్‌కుమార్‌ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో 15 సంవత్సరాలకు పైబడిన ప్రభుత్వ వాహనాలను సోమవారం నుంచే పూర్తిగా నిషేదించినట్లు నిర్ణయం తోసుకుంది. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణపై ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి దీపక్ కుమార్ విలేకరులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ..  ఇటివలే పండుగ సీజన్‌లో నమోదైన కాలుష్య స్థాయిని గమనిస్తే అందులో ఈ వాహనాల నుంచి వెలువడే పొగ కాలుష్యం అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

అందుకే పాట్నా మెట్రో పాలిటన్‌ ఏరియాలో 15 ఏళ్లకు పైబడిన ప్రభుత్వ వాహనాలను నిషేదించామని తెలిపారు. అయితే ప్రైవేటు వాహనాలను ఈ నిషేధం నుంచి మినహాయించామని, కానీ యజమానులు తమ వాహనాలకు కొత్తగా కాలుష్య పరీక్షలు చేయించి ధృవీకరణ పత్రాలను పొందాల్సి ఉంటుదన్నారు. దీని కోసం ప్రత్యేకంగా మంగళవారం నుంచి ఇంటెన్సివ్ డ్రైవ్ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ మంగళవారం జారీ చేస్తామని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

అలాగే కిరోసిన్‌తో నడుస్తూ అధిక కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఆటో రిక్షాలు కొత్తగా పొల్యుషన్‌ టెస్ట్‌ను చేయించుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో డీజిల్‌తో నడుస్తున్న ఆటో రిక్షాలను త్వరలోనే పూర్తిస్థాయి సీఎన్‌జీ లేదా ఎలక్ట్రిక్‌తో నడిచే విధంగా రూపొందించనున్నట్లు తెలిపారు. వీటిని మార్చుకోవడానికి  ఆటో యజమానులకు ప్రోత్సాహం కింద సబ్సిడీలు  కూడా అందజేయనున్నట్లు  పేర్కొన్నారు.

ప్రజా ప్రాధిపాదిత ప్రాజెక్టుల నిర్మాణ స్థలాల కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించింది. అదే విధంగా ప్రైవేట్ భవనాలకు సంబంధించి మునిసిపల్ కార్పొరేషన్లకు ఆదేశాలు ఇచ్చామని ఆయన చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో సౌండ్‌లెస్ జనరేటర్లను మాత్రమే ఉపయోగించుకునేలా సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. చెత్తను పారవేసే ట్రక్కులు, ఇతర వ్యాన్లు డంపింగ్‌ యార్డుకు తీసుకెళ్లే మార్గంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చెత్తను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచాలని ఆదేశించినట్లు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top