స్మార్ట్‌ సిటీ పథకానికి రూ.9,940 కోట్లు | Government releases Rs 9940 crore to states for Smart Cities Mission | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ సిటీ పథకానికి రూ.9,940 కోట్లు

Feb 12 2018 2:54 AM | Updated on Feb 12 2018 2:54 AM

Government releases Rs 9940 crore to states for Smart Cities Mission - Sakshi

న్యూఢిల్లీ: స్మార్ట్‌ సిటీ పథకం కింద ఇప్పటివరకూ అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.9,940 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. ఈ పథకంలో భాగంగా మహారాష్ట్రలోని 8 నగరాలకు రూ.1,378 కోట్లు ఇచ్చినట్లు తెలిపింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లోని 7 నగరాలకు రూ.984 కోట్లు, తమిళనాడులోని 11 నగరాలకు రూ.848 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు నగరాలకు రూ.588 కోట్లు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ గణాంకాలను విడుదల చేసింది. స్మార్ట్‌ సిటీ పథకంలో చేరడానికి పశ్చిమ బెంగాల్‌ విముఖత చూపినా, కోల్‌కతాలోని న్యూ టౌన్‌కు రూ.8 కోట్లు విడుదల చేశామంది.
 

Advertisement
 
Advertisement
Advertisement