మనిషి పోలికలతో మేకపిల్లలు!! | goat gives birth to still birth babies with human face | Sakshi
Sakshi News home page

మనిషి పోలికలతో మేకపిల్లలు!!

Dec 24 2014 4:14 PM | Updated on Sep 2 2017 6:41 PM

మనిషి పోలికలతో మేకపిల్లలు!!

మనిషి పోలికలతో మేకపిల్లలు!!

పులి కడుపున పులిపిల్లే పుడుతుంది.. మేక కడుపున మేక పిల్లే పుడుతుంది అంటారు కదూ. కానీ, కర్ణాటకలోని షోలాపూర్ అనే గ్రామంలో ఓ మేక అచ్చం మనిషి పోలికలతో ఉన్న రెండు పిల్లలను కంది.

పులి కడుపున పులిపిల్లే పుడుతుంది.. మేక కడుపున మేక పిల్లే పుడుతుంది అంటారు కదూ. కానీ, కర్ణాటకలోని షోలాపూర్ అనే గ్రామంలో ఓ మేక అచ్చం మనిషి పోలికలతో ఉన్న రెండు పిల్లలను కంది. అయితే.. ఆ రెండూ పుట్టకముందే మరణించాయి. అచ్చం మనిషి పోలికలతోనే ఉన్న మగ పిల్ల ఉదయం 6.30 గంటలకు పుట్టగా, రెండోది ఐదు గంటల తర్వాత ఆడ మేకపిల్ల పుట్టింది.

ఆ మేకను తాను నాలుగేళ్లుగా పెంచుతున్నానని, అది ఇప్పటికి పది పిల్లలను కనగా, అన్నీ బాగానే ఉన్నాయని మేక యజమాని భాస్కర్ తెలిపారు. ఈ విషయం గ్రామంలో విస్తృతంగా వ్యాపించింది. దాంతో జనం వందల సంఖ్యలో ఆ పిల్లలను చూసేందుకు భాస్కర్ ఇంటి ముందు క్యూకట్టారు. కొంతమందయితే, ఇలా పుట్టడం అరిష్టమని, అందువల్ల వెంటనే వాటిని పూడ్చేయాలని కూడా సలహా ఇచ్చారు.
(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)
వైద్య పరిభాషలో దీన్ని ఫీటల్ అనసర్టా అంటారని, అంటే.. తల్లి కడుపులో ఉండాల్సిన ఉమ్మనీరు పిల్ల శరీరంలోకి వెళ్లిపోతే ఇలా జరుగుతుందని పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ దేవదాస్ చెప్పారు.  జన్యు పరమైన తేడాల వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉందన్నారు. చనిపోయిన మేకపిల్లలను భద్రంగా ఉంచి, వాటిని మైసూరు దసరా ఉత్సవంలో ప్రదర్శిస్తామని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement