గోవా రాజ్‌భవన్ పూర్తిగా నగదు రహితమైంది. సోమవారం దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసుకుంది. దీంతో ఈ కార్యక్రమం సందర్భంగా గవర్నర్ మృదుల సిన్హా తొలి నగదు రహిత లావాదేవీని చేశారు.
పనాజీ: గోవా రాజ్‌భవన్ పూర్తిగా నగదు రహితమైంది. సోమవారం దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసుకుంది. దీంతో ఈ కార్యక్రమం సందర్భంగా గవర్నర్ మృదుల సిన్హా తొలి నగదు రహిత లావాదేవీని చేశారు.
‘గోవా గవర్నర్ మృదుల సిన్హా సోమవారం దోనా పౌలాలోని రాజ్‌భవన్ ఇక నుంచి పూర్తిగా నగదు రహిత లావాదేవీలకు వెళుతోందని స్పష్టం చేశారు. భవన్ నిర్వహణ ఖర్చులు, పర్యటనల వ్యయాలు, తదితరుల ఖర్చులన్నీ కూడా నగదు రహిత లావాదేవీల ద్వారానే జరుగుతాయి' అని రాజ్ భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.