అపహరణకు గురై ఆ తరువాత రూ.80 వేలకు అమ్ముడుపోయి ఐదు నెలలుగా అత్యాచారానికి లోనైన 13 ఏళ్ల బాలికను సోమవారం రాత్రి పోలీసులు...
పాలంపూర్(గుజరాత్): అపహరణకు గురై ఆ తరువాత రూ.80 వేలకు అమ్ముడుపోయి ఐదు నెలలుగా అత్యాచారానికి లోనైన 13 ఏళ్ల బాలికను సోమవారం రాత్రి పోలీసులు గుజరాత్‌లోని బానస్కాంత జిల్లాలోని మాన్‌పురా గ్రామంలో కాపాడారు. ఆమెను రేప్‌చేసిన వ్యక్తితో సహా ఆరుగురిపై కేసు నమోదుచేశారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన బాలిక కుటుంబం గుజరాత్‌లోని బానస్కాంత జిల్లాలోని రూపాపుర గ్రామానికి వలసొచ్చింది.
5 నెలల క్రితం ఆమెను ముగ్గురు కిడ్నాప్ చేసి వేరొకతనికి రూ.80 వేలకు అమ్మారు. అతడు బాధితురాలిని ఓ పొలంలో బందీగా ఉంచి 5నెలలకాలంలో పలుమార్లు రేప్ చేశాడు. తన కూతురు కనిపించకుండా పోవడంతో బాధితురాలి తండ్రి సిహోరీ పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసు పరిష్కారమైంది.