‘సిగరెట్‌’ తరహాలో గంగ హెచ్చరికలు

Ganga water between Haridwar and Unnao unfit for drinking, bathing - Sakshi

న్యూఢిల్లీ: సిగరెట్‌ ప్యాకెట్లపై ఉన్న హెచ్చరిక తరహాలో గంగా నది కాలుష్యంపై పరీవాహక ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గంగా(ఎన్‌ఎంసీజీ)ను ఆదేశించింది. గంగా నది తీవ్రస్థాయిలో కలుషితం కావడంపై ఎన్జీటీ ఆవేదన వ్యక్తం చేసింది. హరిద్వార్‌ నుంచి ఉన్నావ్‌ మధ్య గంగా నది నీరు కనీసం స్నానానికి పనికిరావని వ్యాఖ్యానించింది. ‘ ప్రజలు గంగా నీటిని భక్తి భావంతో సేవిస్తున్నారు.

అది ఎంత ప్రమాదకరమో వారికి తెలియదు. కేవలం సిగరెట్‌ ప్యాకెట్ల మీదే ‘పొగతాగడం మీ ఆరోగ్యానికి హానికరం’ అని రాస్తున్నప్పుడు ఈ నీటిని తాగడం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు ఎందుకు చెప్పకూడదు?’’ అని ఎన్‌జీటీ బెంచ్‌ ప్రశ్నించింది. గంగా నదీ తీరంలో ప్రతి 100 కి.మీ ఓ చోట నీటి స్వచ్ఛతపై బోర్డులను ఏర్పాటు చేయాలని నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గంగ(ఎన్‌ఎంసీజీ)ను ఎన్జీటీ ఆదేశించింది. అక్కడి నీటిని తాగటానికి, స్నానం చేయటానికి వాడొచ్చా? లేదా? అన్న విషయాన్ని బోర్డుల్లో స్పష్టంగా పేర్కొనాలంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top