వానల కోసం కప్పల పెళ్లి

Frogs married in Karnataka to please the rain gods - Sakshi

సాక్షి బెంగళూరు:  జలక్షామం, వర్షాభావాన్ని నివారించేందుకు ఉడుపి జిల్లా నాగరిక సమితి ట్రస్టు, పంచరత్న సేవా ట్రస్టు ఆధ్వర్యంలో కప్పలకు  వైభవంగా పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉడుపి కిదియూర్‌ హోటల్‌ ఆవరణలో శనివారం ఈ కప్పల పెళ్లి వైభవంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు నగరంలోని మారుతి విధికా నుంచి ఊరేగింపుగా పెండ్లిబృందం బయలుదేరి పాత డయాన సర్కిల్‌ గుండా కవి ముద్దణ మార్గంలో ఉడుపి కిదియూర్‌ హోటల్‌ వద్దకు చేరుకుని, అనంతరం కప్పలకు వివాహం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top