కప్పల పెళ్లికి రండి | Frog marriage in Karnataka | Sakshi
Sakshi News home page

కప్పల పెళ్లికి రండి

Jun 8 2019 12:59 PM | Updated on Jun 8 2019 12:59 PM

Frog marriage in Karnataka - Sakshi

ముద్రించిన వివాహ పత్రిక

కప్పలకు  వైభవంగా పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు

సాక్షి బెంగళూరు:   జలక్షామం, వర్షాభావాన్ని నివారిం చేందుకు ఉడుపి జిల్లా నాగరిక సమితి ట్రస్టు, పంచరత్న సేవా ట్రస్టు ఆధ్వర్యంలో కప్పలకు  వైభవంగా పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈమేరకు పెళ్లిపత్రికలను ముద్రించి పంపిణీ చేశారు. ఉడుపి కిదియూర్‌ హోటల్‌ ఆవరణలో శనివారం ఈ కప్పల పెళ్లి వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు నగరంలోని మారుతి విధికా నుంచి ఊరేగింపుగా పెండ్లిబృందం బయలుదేరి పాత డయాన సర్కిల్‌ గుండా కవి ముద్దణæ మార్గంలో ఉడుపి కిదియూర్‌ హోటల్‌ వద్దకు చేరుకోనున్నారు. అనంతరం కప్పలకు వివాహం చేస్తారు.  

Advertisement
 
Advertisement
Advertisement