అవసరమైతే ‘హద్దు’ దాటుతాం: రాజ్‌నాథ్‌

Forces can cross border if needed to protect country - Sakshi

న్యూఢిల్లీ: దేశ సమైక్యతను కాపాడుకునేందుకు.. అవసరమైతే భద్రతా దళాలు నియంత్రణ రేఖను దాటి ముందుకు వెళ్తాయని హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరించారు. జమ్మూకశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగంగానే ఉంటుందని స్పష్టం చేశారు. పాక్‌ ఎన్ని కుయుక్తులకు పాల్పడినా కశ్మీర్‌ను భారత్‌ నుంచి వేరు చేయలేదన్నారు. శనివారం ఢిల్లీలో జరిగిన న్యూస్‌ 18 రైజింగ్‌ ఇండియా సమిట్‌లో ఆయన ప్రసంగించారు. ‘భారత్‌ను అంతర్గతంగా భద్రంగా ఉంచుకుంటాం. అంతేకాదు అవసరమైతే.. దేశాన్ని రక్షించుకునేందుకు సరిహద్దులు దాటి ముందుకు వెళ్తాం’ అని వ్యాఖ్యానించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top