ఆర్థిక ప్యాకేజీ : సీతారామన్‌ మూడో ప్రెస్‌మీట్‌

FM Nirmala Sitharaman to announce 3rd tranche Rs 20 lakh crore package - Sakshi

ఆర్థికమంత్రి నిర‍్మలా సీతారామన్‌  మూడవ ప్రెస్‌మీట్‌

ఆర్థిక ప్యాకేజీ మూడోవిడత  వివరాలు

సాక్షి, న్యూడిల్లీ :  కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్‌ రూ. 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్‌ భారత్ అభియాన్ ఎకనామిక్ ప్యాకేజీపై మూడో విడత  వివరాలను అందించ నున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నేషనల్ మీడియా సెంటర్‌లో విలేకరుల సమావేశంలో ఈ ప్యాకేజీకి సంబంధించి ఆమె ముచ్చటగా మూడోసారి  ప్రసంగించ నున్నారు. (రైతులకు 2 లక్షల కోట్లు)

కరోనా వైరస్‌, సంక్షోభం లాక్‌డౌన్‌  ఆంక్షల నేపథ్యంలో కేంద్రం భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ ఉపశమన చర‍్యలపై వరుసగా  మీడియా సమావేశాల వివరిస్తున్న ఆర్థికమంత్రి  సీతారామన్ బుధవారం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఇ)  బ్యాంకింగ్ రహిత ఫైనాన్స్ కంపెనీలకు (ఎన్‌బీఎఫ్‌సీ)  రుణసదుపాయాలను కల్పించారు.. గురువారం (మే 14)   ప్యాకేజీకి సంబంధించి రెండవ దశ చర్యలను ప్రకటించారు.  ఇందులో వలస కార్మికులు, వీధి విక్రేతలు, చిన్న వ్యాపారులు, చిన్న రైతుల ప్రయోజనాలపై దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top