షాకింగ్: ఏసీ పైపులో 40 పాము పిల్లలు 

Finds 40 baby snakes from AC vent: Meerut farmer gets scary  - Sakshi

 ఏసీ వెంట్ లో 40 పాము పిల్లలు

 షాకైన కుటుంబం

సాక్షి,మీరట్ : ఉత్తర ప్రదేశ్ లో భీతి గొలిపే సంఘటన వెలుగు చూసింది. మీరట్ జిల్లాలోని ఒక గ్రామంలో ఒక రైతుకు చెందిన ఏసీలో పాము కాపురం పెట్టింది. ఏకంగా 40 పిల్లలు బయటపడటం స్థానికంగా కలకలం రేపింది.  

వివరాల్లోకి వెళితే.. ఈ సంఘటన సోమవారం రాత్రి కంకర్‌ఖేరా పోలీసు స్టేషన్ పరిధిలోని పావ్లీ ఖుర్ద్ గ్రామంలో జరిగింది.  శ్రద్ధానంద్ అనే రైతు తన ఇంట్లో ముందు నేలమీద ఒక పాము పిల్లను చూశారు. దాన్ని తీసి అవతల పారేశారు. కొద్దిసేపటి తరువాత, నిద్రించేందుకు తన గదికి వెళ్లేసరికి మంచం మీద మరో మూడింటిని చూశారు. దీంతో ఏసీని  ఓపెన్ చేసి మరింత నిశితంగా పరిశీలించినపుడు ఏసీ పైపులో 40 పాము పిల్లలను చూసి షాక్ అయ్యారు. ఈ వార్త వ్యాపించడంతో స్థానిక ప్రజలు శ్రద్ధానంద్ ఇంటి వద్ద గుమిగూడారు. చివరకు స్థానికుల సహాయంతో, రైతు వాటిని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. చాలా కాలంగా ఏసీ వాడకపోవడం,  లేదా సర్వీసింగ్ చేయకపోవడంతో పాములు గుడ్లు పెట్టి ఉండవచ్చని,  ఆ గుడ్ల నుంచి పిల్ల‌లు ఇపుడు బ‌య‌ట‌కు వచ్చాయని స్థానిక పశువైద్యుడు వత్సల్  అభిప్రాయపడ్డారు.

చదవండి : ఉద్యోగులకు రెనాల్ట్ ఇండియా వరాలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top