ఆడ‌పిల్ల ఉంటే ప్ర‌తినెలా రూ.2 వేలు: నిజమెంత‌?

Fact Check: PM Kanya Ashirwad Yojana Is False Scheme - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: 'ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పథకం.. ఆడపిల్లలకు అద్భుతమైన పథకం. దీనికి ద‌ర‌ఖాస్తు చేసుకుంటే కేంద్ర ప్ర‌భుత్వ‌మే సంవ‌త్స‌రానికి 24,000 రూపాయ‌లు ఇస్తుంది..' అంటూ ఓ వార్త వాట్సాపుల‌ల్లో, ఫేస్‌బుక్‌లో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. మీ ఇంట్లో ఆడ‌పిల్ల ఉంటే భ‌యం అక్క‌ర్లేద‌ని, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ఉచితంగా డ‌బ్బులు పంచుతార‌ని దీని సారాంశం. ఎంతోమంది దీన్ని గుడ్డిగా న‌మ్ముతూ మిగ‌తా గ్రూపుల‌కు షేర్ చేస్తున్నారు. ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే అప్లై చేసుకొమ్మ‌ని ఉచిత స‌ల‌హా ఇస్తున్నారు. కానీ అస‌లు ఆ ప‌థక‌మే లేన‌ప్పుడు దేనికి ద‌ర‌ఖాస్తు చేస్తారు?

నిజానికి ప్ర‌ధాన‌మంత్రి క‌న్యా ఆశీర్వాద్ యోజ‌న పేరుతో ఎలాంటి ప్ర‌భుత్వ ప‌థ‌కం లేదు. ఆ ప‌థ‌కం గురించి కేంద్ర ప్ర‌భుత్వం ఎప్పుడూ ఎక్క‌డా చెప్ప‌నేలేదు. అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం ఈ అస‌త్య‌పు ప‌థ‌కాన్ని గురించి చాటింపు చేస్తుండ‌టంతో ప్రెస్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ బ్యూరో(పీఐబీ) ఈ వార్త‌ను ఖండించింది. అవి ఫేక్ మేసేజ్‌లు అని, ఆ పేరుతో ఎటువంటి ప్ర‌భుత్వ ప‌థ‌కం లేద‌ని స్ప‌ష్టం చేసింది. కాబ‌ట్టి ఈసారి ఎవ‌రైనా మీకు ఈ త‌ప్పుడు స‌మాచారం పోస్ట్ చేస్తే న‌మ్మి మోస‌పోకండి. (కోవిడ్‌-19పై టాప్‌ ఫేక్‌ న్యూస్‌లు)

త‌ప్పుడు వార్త పేర్కొంటున్న అంశం: ప‌్ర‌ధాన‌మంత్రి క‌న్యా ఆశీర్వాద్ యోజ‌న ద్వారా అన్ని రాష్ట్రాల్లో 5 నుంచి 18 ఏళ్ల ఆడ‌పిల్ల ఖాతాల్లోకి ప్ర‌తినెల రెండు వేలు అంటే సంవ‌త్స‌రానికి 24 వేల రూపాయ‌లు కేంద్ర‌ప్ర‌భుత్వ‌మే జ‌మ చేస్తుంది.
ఫ్యాక్ట్ చెక్‌: ఇది పూర్తిగా త‌ప్పుడు వార్త‌. అస‌లు అలాంటి ప‌థ‌కమే లేదు. (బార్‌కోడ్‌తో చైనా వ‌స్తువును గుర్తించొచ్చా?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top