బార్‌కోడ్‌తో వ‌స్తువు త‌యారీ దేశాన్ని గుర్తించొచ్చా?

Fact Check: Made in China Products Not Identified By Barcode - Sakshi

న్యూఢిల్లీ: 'ఏదేమైనా స‌రే చైనా ఉత్ప‌త్తుల‌ను వాడేదే లేదు.. ఎలాగో ఇప్పుడు వాడుతున్న వాటిని ఏమీ చేయ‌లేం. క‌నీసం ఇక ముందైనా చైనా ఉత్ప‌త్తులను కొనుగోలు చేయ‌కూడ‌దు" ప్ర‌స్తుతం ఎంతోమంది భార‌తీయులు చేస్తున్న ప్ర‌తిజ్ఞ ఇది. ఇది నిజంగా ఆచ‌ర‌ణ‌సాధ్య‌మేనా అన్న విష‌యం ప‌క్క‌న పెడితే దాన్ని చేసి చూపించాల‌నే త‌ప‌న మాత్రం చెప్ప‌న‌ల‌వి కాదు. ఇప్ప‌టికే ఎంతోమంది ఏదైనా కొనాలంటే దాని వివ‌రాలు చూసిన త‌ర్వాతే కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. అయితే ఆ వ‌స్తువు చైనాకు చెందిందా? స‌్వ‌దేశీ వస్తువా? అని గుర్తించ‌డం క‌ష్టంగా మారింది. ఈ నేప‌థ్యంలో బార్‌కోడ్ ద్వారా దీన్ని సులువుగా తెలుసుకోవ‌చ్చంటూ ఓ వార్త సామాజిక మాధ్య‌మాల్లో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. బార్‌కోడ్ ప్రారంభంలో 690 నుంచి 699 మ‌ధ్య అంకెలు ఉంటే అది చైనా వ‌స్తువు, 890 ఉంటే అది ఖ‌చ్చితంగా ఇండియాదేన‌ని ఈ వార్త సారాంశం. (హన్‌ దురహంకారం!!)

ఇది నిజ‌మేన‌ని న‌‌మ్మి ఎంతోమంది ఆ ఫొటోను సేవ్ చేసి పెట్టుకుంటున్నారు కూడా! కానీ, అది పూర్తిగా నిజం కాదు. వ‌స్తువుకు అతికించి ఉన్న‌లేబుల్‌పై ఉండే బార్‌కోడ్ ఉత్ప‌త్తి చేసిన దేశం పేరును వెల్ల‌డించ‌దు. కాక‌పోతే 690 నుంచి 699 మ‌ధ్య అంకెల‌ను చైనాకు కేటాయించ‌గా 890 నంబ‌ర్ భార‌త్‌కు కేటాయించారు. కానీ ఆ నంబ‌ర్ ఉన్న వ‌స్తువుల‌న్నీ స‌ద‌రు దేశంలో త‌యారు చేసిన‌ట్లు మాత్రం కాదు. కేవ‌లం వ‌స్తువు త‌యారుచేసే కంపెనీ ఆ దేశంలో ఉన్న‌ట్లు లెక్క‌. ఇక‌ బార్‌కోడ్ కింద ఉండే ఈ అంకెల‌ను గ్లోబ‌ల్ ట్రేడ్ ఐట‌మ్ నంబ‌ర్ అని పిలుస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు.. భార‌త కంపెనీ చైనా వ‌స్తువుల‌ను దిగుమ‌తి చేసుకుంద‌నుకోండి. అనంత‌రం వాటిలో మార్పు చేర్పులు చేసి లేదా య‌థాత‌థంగా తిరిగి ప్యాకింగ్ చేసి బంగ్లాదేశ్‌కు పంపిణీ చేస్తుంది. అప్పుడు ఆ వ‌స్తువుపై ఇండియా బార్‌కోడ్ మాత్ర‌మే ఉంటుంది. అప్పుడు బంగ్లాదేశ్‌వాసులు వారు అందుకున్న వ‌స్తువు ఎక్క‌డ ఉత్ప‌త్తి అయ్యింద‌నే విష‌యాన్ని క‌నుగొన‌లేరు. (చైనా సైనిక మరణాలపై అంతా గందరగోళం)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top