ఇక ఫేస్‌బుక్‌లో ప్రైవేట్‌ ప్రొఫైల్స్‌ | Sakshi
Sakshi News home page

ఇక ఫేస్‌బుక్‌లో ప్రైవేట్‌ ప్రొఫైల్స్‌

Published Tue, Sep 12 2017 4:25 PM

ఇక ఫేస్‌బుక్‌లో ప్రైవేట్‌ ప్రొఫైల్స్‌ - Sakshi

సాక్షి,న్యూఢిల్లీః సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ యూజర్లను ఆకట్టుకునేందుకు మరో ఫీచర్‌ను ఇంట్రడ్యూస్‌ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రైవేట్‌ ప్రొఫైల్‌గా పిలిచే కొత్త తరం ప్రొఫైల్‌పై ఫేస్‌బుక్ ప్రస్తుతం దృష్టిసారించినట్టు నెక్ట్స్ వెబ్‌ అనే టెక్నాలజీ సంస్థ నివేదిక వెల్లడించింది. ఈ ప్రొపైల్‌ యూజర్‌ ఫ్రైండ్‌ లిస్ట్‌లో ఉన్న వారందరికీ కాకుండా కేవలం సన్నిహిత మిత్రుల గ్రూపుకే పరిమితంగా అందుబాటులో ఉంటుందని తెలిసింది.
 
ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ ఎఫ్‌బీ మొబైల్‌ యాప్‌లో ఈ కొత్త ఫీచర్‌ బీటా వెర్షన్‌ అందుబాటులో ఉంది. క్రియేట్‌ ఏ ప్రైవేట్‌ ప్రొఫైల్‌ అని యూజర్‌ను కోరుతూ ఫుల్‌ స్క్రీన్‌ డిస్‌ప్లే పొందుపరిచారు. దీంతో పాటు ఇన్‌స్టంట్‌ వీడియో ఫీచర్‌ను కూడా ఎఫ్‌బీ ప్రవేశపెట్టనుంది. యూజర్లు వీడియోను డౌన్‌లోడ్‌ చేసుకోకుండానే నేరుగా దాన్ని వీక్షించే వెసులుబాటు ఈ ఫీచర్‌లో అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు ఫేస్‌బుక్‌ తన యాప్‌లో కూడా పలు మార్పులు చేపడుతోంది.

Advertisement
 
Advertisement