బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో అక్రమాల వివాదం మరో మలుపు తిరిగింది.
డీఐజీ రూపకు కర్ణాటక జైళ్ల శాఖ మాజీ డీజీపీ లీగల్ నోటీసులు
సాక్షి, బెంగళూరు: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో అక్రమాల వివాదం మరో మలుపు తిరిగింది. రాష్ట్ర జైళ్ల శాఖ మాజీ డీజీపీ సత్యనారాయణరావ్ ప్రస్తుత బెంగళూరు నగర ట్రాఫిక్ కమిషనర్, జైళ్లశాఖ మాజీ డీఐజీ రూప మౌద్గిల్‌కి బుధవారం లీగల్ నోటీసులు పంపించారు. తనపై చేసిన ఆరోపణలకు మూడ్రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే రూ.50 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు.
సెంట్రల్‌జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళ నుంచి రూ.2 కోట్ల ముడుపులు తీసుకుని ప్రత్యేక సౌకర్యాలు కల్పించారని సత్యనారాయణరావ్‌పై రూప ఇటీవల ఆరోపణలు చేయడం, సర్కారుకు నివేదికలు పంపడం తెలిసిందే.