
సాక్షి,బెంగళూరు: భారత్ సిలికాన్ వ్యాలీ బెంగళూరు నగర రోడ్ల గురించి చర్చలు కొనసాగుతున్నాయి. ఇక్కడ 90శాతం గుంతలు,రెండు శాతం రోడ్లంటూ నగర వాసులు విమర్శలు గుప్పిస్తున్నారు. గుంతలమయమైన రోడ్లను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
తాజాగా,నగరంలోని వర్తుర్-గుంజూర్ ప్రాంతంలో గుంతల మయమైన రోడ్ల గురించి స్థానికంగా ఉండే ఓ వ్యక్తి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ పోస్టుకు నగర వాసులతో పాటు నెటిజన్లు సైతం విమర్శలు,ఆవేదనతో కూడిన కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇక ఆ ఫొటోను పోస్టు చేసిన సదరు ప్రాంత నివాసి.. సాధారణంగా..రోడ్డు పరిమాణం 98 శాతం..గుంతల పరిమాణం 2 శాతం ఉంటుంది. అక్టోబర్ 17న బెంగళూరులో తీసిన ఈ ఫోటోలో రోడ్డు కేవలం 2 శాతం మాత్రమే.. గుంతల రోడ్లు 98 శాతం ఉంది.మనం వర్తూర్-గుంజూర్‌ను గుంతలు లేనిదిగా చేయగలమా? అంటూ గ్రేటర్ బెంగళూరు అథారిటీ కమిషనర్‌కు ట్యాగ్ చేశారు.
ఆ పోస్టుకు స్పందిస్తున్న నెటిజన్లు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు మా వెన్నెముకలు విరుగుతున్నాయి. పన్ను చెల్లించే ప్రజల పట్ల ఈ నిర్లక్ష్యం ఎందుకు?’అంటూ ఓ నివాసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో నెటిజన్ ‘నేషనల్ అక్వాటిక్ హైవే’ కార్లు బోట్లుగా మారుతున్నాయి.హెల్మెట్లు లైఫ్ జాకెట్లుగా... గూగుల్ మ్యాప్స్ చెబుతోంది‘500 మీటర్లు ఈదుతూ ముందుకు సాగండి’ అని. ఇలా రోడ్లు లేక్‌లుగా మారితే..కార్లు కాదు... బోట్లే అవసరం!’అంటూ చమత్కరిస్తున్నారు.
Normally the Road size will be 98% and the Pothole size would be 2%.
In this photo shot on 17th October 2025 in Bengaluru, Road is only 2% and LakeHole is 98% 🙏@GBAChiefComm ji, can we make Varthur-Gunjur Pothole Free?#FI pic.twitter.com/pYYLKpG63O— Fundamental Investor ™ 🇮🇳 (@FI_InvestIndia) October 18, 2025