లాలూ కూతురును చుట్టుముడుతున్న కష్టాలు | ED files charge sheet against Lalu daughter chartered accountant | Sakshi
Sakshi News home page

లాలూ కూతురును చుట్టుముడుతున్న కష్టాలు

Jul 21 2017 3:31 PM | Updated on Sep 5 2018 1:38 PM

లాలూ కూతురును చుట్టుముడుతున్న కష్టాలు - Sakshi

లాలూ కూతురును చుట్టుముడుతున్న కష్టాలు

బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూతురును కష్టాలు చుట్టుముడుతున్నాయి.

న్యూఢిల్లీ: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూతురును కష్టాలు చుట్టుముడుతున్నాయి. మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ కూతురు మీసా భారతీ చార్టెడ్‌ అకౌంటెంట్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు చార్జిషీట్‌ దాఖలు చేశారు.

ఇప్పటికే కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌కు అదనంగా తాజాగా సప్లిమెంటరీ చార్జిషీట్‌ దాఖలు చేసినట్లు కోర్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక న్యాయమూర్తి నరేశ్‌ కుమార్‌ మల్హోత్రా ముందు చార్జిషీట్‌ను ఈడీ అధికారులు దాఖలు చేసినట్లు తెలిసింది. అయితే, దీనిపై వచ్చే నెల(ఆగస్టు) 9న విచారణ చేస్తామని న్యాయమూర్తి చెప్పినట్లు సమాచారం. ఈ కేసులో మొత్తం 35మందిపై ఈడీ అధికారులు చార్జిషీట్‌ నమోదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement