'మేం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ లక్ష్యం వేరు' | Earlier cross-LoC strikes had different goals: former NSA | Sakshi
Sakshi News home page

'మేం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ లక్ష్యం వేరు'

Oct 12 2016 12:02 PM | Updated on Sep 4 2017 5:00 PM

'మేం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ లక్ష్యం వేరు'

'మేం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ లక్ష్యం వేరు'

గతంలో కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని..అయితే వారిని బహిర్గతం చేయలేదని యూపీఏ హయాంలో జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ :  గతంలో కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని... అయితే వారిని బహిర్గతం చేయలేదని యూపీఏ హయాంలో జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ స్పష్టం చేశారు. బుధవారం న్యూఢిల్లీలో శివశంకర్ మీనన్ మాట్లాడుతూ... తాము నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ లక్ష్యం వేరని తెలిపారు. దేశంలో ప్రజల మనోభావాలను మేనేజ్ చేయడం వాటి లక్ష్యం కాదన్నారు.

చొరబాట్లు జరగకుండా నిరోధించడమే వాటి లక్ష్యం అని పేర్కొన్నారు. అప్పటి ఆపరేషన్ వివరాలు వెల్లడించనందుకు చింతించడం లేదని శివ శంకర్ మీనన్ చెప్పారు. పాక్ అక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదులే లక్ష్యంగా భారత్ ఆర్మీ ఇటీవల సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. దీనిపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement