breaking news
Shiv Shankar Menon
-
దేశానికి లోపలి నుంచే ముప్పు!
భారతదేశానికి ముప్పు పొంచి ఉన్నది లోపలి నుంచే తప్ప పాకిస్థాన్, చైనా లాంటి ఇతర దేశాల నుంచి కాదని మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ అన్నారు. ఆ రెండు దేశాల వల్ల భారతదేశానికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. యూపీఏ హయాంలో ఆయన ఎన్ఎస్ఏగా ఉన్నారు. జాతీయ భద్రతకు అసలైన ముప్పు దేశం లోపలి నుంచే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 1950లలో అయితే బయటినుంచి ముప్పు ఉండేదని, 60లలో చివరి వరకు కూడా అంతర్గతంగా వేర్పాటువాదులతో ముప్పు ఉంది గానీ ఎక్కువ కాలం కాదని తెలిపారు. ప్రస్తుతం దేశంలో వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం ఇవన్నీ క్రమంగా తగ్గుతున్నాయని చెప్పారు. 2012 తర్వాతి నుంచి మతఘర్షణలు, సామాజిక హింస, అంతర్గత హింస చాలా ఎక్కువైపోయాయని, వీటిని తక్షణం అరికట్టాలని మీనన్ సూచించారు. ఇది సంప్రదాయ శాంతిభద్రతల సమస్య కాదని.. దీన్ని ఎలా అరికట్టాలో ప్రభుత్వానికి, పోలీసులకు కూడా బాగా తెలుసని శివశంకర్ మీనన్ అన్నారు. మహిళలపై హింస, వర్గాల మధ్య ఘర్షణ, కులాల కుమ్ములాటలు... ఇలాంటివన్నీ సామాజిక, ఆర్థిక మార్పుల వల్లే వస్తున్నాయని, పట్టణీకరణ కూడా ఇందుకు సగం కారణమని ఆయన విశ్లేషించారు. వీటివల్ల దీర్ఘకాలంలో చాలా సమస్య తలెత్తుతుందని చెప్పారు. భారతదేశం చాలా మారిందని, ఇది చాలా సమాజాల్లో సాధారణమే అయినా, మార్పు వల్ల తలెత్తే దుష్పరిణామాలను సక్రమంగా అరికట్టాలని ఆయన తెలిపారు. -
'మేం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ లక్ష్యం వేరు'
న్యూఢిల్లీ : గతంలో కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని... అయితే వారిని బహిర్గతం చేయలేదని యూపీఏ హయాంలో జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ స్పష్టం చేశారు. బుధవారం న్యూఢిల్లీలో శివశంకర్ మీనన్ మాట్లాడుతూ... తాము నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ లక్ష్యం వేరని తెలిపారు. దేశంలో ప్రజల మనోభావాలను మేనేజ్ చేయడం వాటి లక్ష్యం కాదన్నారు. చొరబాట్లు జరగకుండా నిరోధించడమే వాటి లక్ష్యం అని పేర్కొన్నారు. అప్పటి ఆపరేషన్ వివరాలు వెల్లడించనందుకు చింతించడం లేదని శివ శంకర్ మీనన్ చెప్పారు. పాక్ అక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదులే లక్ష్యంగా భారత్ ఆర్మీ ఇటీవల సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. దీనిపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.