‘గుంటూరు–గుంతకల్లు’ డబ్లింగ్‌కు ఓకే | Dubling ok to "Guntur-Guntakal ' | Sakshi
Sakshi News home page

‘గుంటూరు–గుంతకల్లు’ డబ్లింగ్‌కు ఓకే

May 18 2017 1:15 AM | Updated on Aug 15 2018 6:34 PM

‘గుంటూరు–గుంతకల్లు’ డబ్లింగ్‌కు ఓకే - Sakshi

‘గుంటూరు–గుంతకల్లు’ డబ్లింగ్‌కు ఓకే

గుంటూరు–గుంతకల్లు మధ్య విద్యుదీకరణతో కూడిన రెండో రైల్వే లైను నిర్మాణానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది.

రూ.3,631 కోట్ల అంచనా వ్యయం, ఐదేళ్లలో పూర్తి

సాక్షి, న్యూఢిల్లీ: గుంటూరు–గుంతకల్లు మధ్య విద్యుదీకరణతో కూడిన రెండో రైల్వే లైను నిర్మాణానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకుంది. రూ.3,631 కోట్ల అంచనా వ్యయంతో 401.47 కి.మీ. మేర రైల్వే లైన్‌ నిర్మించనున్నారు. ఐదేళ్లలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని కేంద్ర రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం భరిస్తాయి. రాజధాని నుంచి రాయలసీమ ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీని పెంచాలంటూ ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్టు సీసీఈఏ అభిప్రాయపడింది.

గుంటూరు–గుంతకల్లు మధ్య గణనీయమైన స్థాయిలో ట్రాఫిక్‌ ఉందని, డబుల్‌ లైన్‌ నిర్మాణంతో భవిష్యత్తు అవసరాలనూ తీర్చుతుందని మంత్రిమండలి వివరాలను వెల్లడించిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ఈ రైల్వే లైన్‌ వల్ల గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మీడియాకు వివరిం చారు.రాయల సీమనుంచి రవాణా మెరుగు అవుతుం దన్నారు. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల నుంచి బెంగళూరు చేరేందుకు  సులువుగా ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement