భారతపటం విషయంలో పాక్ జోక్యం సరికాదని భారత్ మండిపడింది. భారత పటాన్ని తప్పుగా చూపేవారికి భారీ జరిమానా, జైలు శిక్ష విధించేందుకు ఉద్దేశించిన బిల్లు విషయంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని
న్యూఢిల్లీ: భారతపటం విషయంలో పాక్ జోక్యం సరికాదని భారత్ మండిపడింది. భారత పటాన్ని తప్పుగా చూపేవారికి భారీ జరిమానా, జైలు శిక్ష విధించేందుకు ఉద్దేశించిన బిల్లు విషయంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని మంగళవారం పాక్ విజ్ఞప్తి చేసింది. దీన్ని భారత్ తప్పుబట్టింది.
భారత విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్‌మాట్లాడుతూ ప్రతిపాదిత బిల్లు పూర్తిగా భారత చట్టాలకు సంబంధించిన అంతర్గత అంశమన్నారు. పాకిస్తాన్‌కు, ఇతరులకు దీనిపై మాట్లాడటానికి అధికారం లేదన్నారు. కాగా, ఈ బిల్లుపై పాక్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్.అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం ఆపాలని ఐరాసను కోరింది. కశ్మీర్‌ను భారత్‌లో భాగంగా చూపొద్దని పేర్కొంది.