న్యూస్‌పేపర్లు ఇలా వాడుతున్నారా.. జాగ్రత్త! | do not use news papers to remove excess oil from food material, warn scientists | Sakshi
Sakshi News home page

న్యూస్‌పేపర్లు ఇలా వాడుతున్నారా.. జాగ్రత్త!

Oct 31 2016 11:56 AM | Updated on Oct 5 2018 6:36 PM

న్యూస్‌పేపర్లు ఇలా వాడుతున్నారా.. జాగ్రత్త! - Sakshi

న్యూస్‌పేపర్లు ఇలా వాడుతున్నారా.. జాగ్రత్త!

ఇంట్లో వేసిన మిరపకాయ బజ్జీలు, పుణుగులు, పూరీల లాంటివి బాగా నూనె పీల్చినప్పుడు.. వాటి నుంచి నూనె పోవడానికి న్యూస్‌పేపర్లలో పెడుతున్నారా?

ఇంట్లో వేసిన మిరపకాయ బజ్జీలు, పుణుగులు, పూరీల లాంటివి బాగా నూనె పీల్చినప్పుడు.. వాటి నుంచి నూనె పోవడానికి న్యూస్‌పేపర్లలో పెడుతున్నారా? రోడ్డు పక్కన బండ్ల మీద ఏదైనా ఆహారం తిన్న తర్వాత చేతులు తుడుచుకోడానికి పాత న్యూస్‌పేపర్లు ఉపయోగిస్తున్నారా.. అలా అయితే మీరు కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. ఎందుకంటే.. అలా చేశారంటే మీ శరీరంలోకి గ్రాఫైట్ వెళ్తుందట. పేపర్లమీద కథనాలు ప్రింట్ చేయడానికి ఉపయోగించే ఇంకులో గ్రాఫైట్ ఉంటుంది. పత్రిక పొడిగా ఉన్నంతసేపు.. అంటే చదివేటప్పుడు దాంతో ఎలాంటి సమస్య ఉండదు. కానీ, అది ఏమాత్రం తడిగా అయినా.. చాలా ప్రమాదకరంగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
ఇళ్లలో ఏవైనా స్నాక్స్ చేసుకున్నప్పుడు వాటి నుంచి నూనె తీసేయడానికి చాలామంది ఇళ్లలో ఉండే పాత న్యూస్‌పేపర్లు ఉపయోగిస్తారని, అది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. అలా ఏయడం వల్ల ఆహారనాళిక ద్వారా నేరుగా గ్రాఫైట్ మన శరీరంలోకి చేరిపోయి, మన మూత్రపిండాలు, కాలేయాలను దెబ్బతీయడంతో పాటు.. ఎముకలు, కణజాలాల ఎదుగుదలను కూడా నిరోధిస్తుంది. సాధారణంగా మన శరీరంలోకి వివిధ మార్గాల ద్వారా చేరే ప్రమాదకరమైన విష పదార్థాలు మలవిసర్జన ద్వారానే వెళ్లిపోతాయి. కానీ గ్రాఫైట్ పరిస్థితి మాత్రం అలా కాదు. అది ఎక్కడికీ పోకుండా అలాగే పేరుకుపోతుంది. దాంతో ప్రమాదం మరింత పెరుగుతుంది. అందువల్ల న్యూస్‌పేపర్లను కేవలం చదవడానికి మాత్రమే ఉపయోగించడం మంచిది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement